Krithi Shetty Lucky Angel.. టాలెంట్ వుంటే ఎలాంటోళ్లైనా కెరీర్లో సక్సెస్ అయ్యి తీరుతారని చెబుతుంటారు. కానీ, బేబమ్మ.. అదేనండీ కృతి శెట్టి విషయంలో ప్రతిసారీ అది అబద్ధమవుతూ వస్తోందే.!
అవును నిజమే.! కృతి శెట్టికి అందమే కాదు.. మంచి యాక్టింగ్ టాలెంట్ కూడా వుంది. కానీ, లక్కు కలిసి రావడం లేదంతే.
తొలి సినిమాతోనే తనలోని యాక్టింగ్ టాలెంట్ ఏంటో చూపించేసింది కృతి శెట్టి. అలాగే, తనదైన అందంతో కుర్రకారును తన వైపుకు తిప్పేసుకుంది కూడా.
Krithi Shetty Lucky Angel.. అది సరే, అసలైనదెక్కడమ్మా బేబమ్మా.!
కుర్ర కారునే కాదే ఏకంగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించేసింది. అవకాశాలు కూడా అలాగే దక్కించుకుంది. కానీ, అదృష్టం మరోలా రాసి పెట్టుంది కృతి శెట్టికి.
అదేంటో.! కృతి శెట్టి నటించిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వచ్చింది. దాంతో, ఇంకేముంది.! ‘ఐరెన్ లెగ్’ అనే ట్యాగ్ వేసేసి అమ్మడిని రేస్ నుంచి తప్పించేశారు.

లాంగ్ గ్యాప్ తర్వాత రీసెంట్గా శర్వానంద్ నటించిన ‘మనమే’ సినిమాతో మళ్లీ కృతి శెట్టి ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకీ సేమ్ టు సేమ్ టాక్. అలా వచ్చి, ఇలా వెళ్లిపోయింది ధియేటర్స్ నుంచి ఈ సినిమా. సర్లే ఓటీటీలో వస్తుంది కదా.. అని వెయిట్ చేశారు కొందరు బేబమ్మ అభిమానులు.
‘మనమే’కి ఏం తక్కువా.! బేబమ్మకింకేం తక్కువా.!
అయితే, అంత ఈజీగా ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు ఈ సినిమా. బోలెడన్ని లావాదేవీల అనంతరం ఎట్టకేలకు ఓటీటీకి వచ్చిన ‘మనమే’ సినిమా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఓ సినిమా హిట్ అవ్వాలంటే ఇంత కన్నా ఇంకేం కావాలి.? ఇలాంటి సినిమాల్ని ఎందుకు చంపేస్తున్నారు.? అసలు హిట్టు బొమ్మకి వుండాల్సిన లక్షణాలేంటీ.? ఇలాంటి ప్రశ్నలు చాలా మంది ఓటీటీ ఆడియన్స్‌లో.
ఈ మధ్య కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయో, కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో అర్ధం కాని పరిస్థితి.

అదే ముద్దుగుమ్మలకీ వర్తిస్తోంది. ఒకప్పుడు టాలెంట్ వుంటే చాలు.. స్టార్డమ్ దక్కించుకోవడం సులువనిపించేది.
కానీ, ఇప్పుడు టాలెంట్‌తో పని లేదనిపిస్తోంది. అందంతో అంత కన్నా పని లేదనిపిస్తోంది. కేవలం అదృష్టం వుంటే చాలనిపిస్తోంది.
అదే స్టార్‌డమ్‌కి తలుపులు తెరిచేస్తుంది.పాపం.! కృతి శెట్టికి అదే లేదు. నిజానికి ‘మనమే’ సినిమాలో కృతి శెట్టి చాలా అందంగా కనిపించింది. ఎప్పటిలాగే తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేసింది.
Also Read: ఛ.! నిజమా.? నీకెవరు చెప్పారు పాయల్.?
కాన్సెప్ట్.. కమర్షియల్ ఎఫెక్ట్స్.. ఇలా అన్నీ చూసుకుంటే.. ‘మనమే’ ఓ హిట్టు బొమ్మే.! కృతి శెట్టి అదృష్టాన్ని మార్చాల్సిన బొమ్మే.
కానీ, అలా జరగలేదు. ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ, ‘మనమే’ని హిట్టు లిస్టులో వేయలేదు. ఏది ఏమైతేనేం.! బేబమ్మ టాలెంట్ వృధా అయిపోతోందే.! అని ఆమె అభిమానులయితే తెగ పీలయిపోతున్నారు సుమీ.!