దొంగ సంతకాలు పెట్టే ఎమ్మెల్యేలకి గౌరవ వేతనమెందుకు అధ్యక్షా.!
Ayyanna Patrudu
YSRCP MLAs AP Assembly.. కొందరు ఎమ్మెల్యేలు, అసెంబ్లీకి వచ్చి దొంగ సంతకాలు పెడుతున్నారు.! దొంగల్లా వచ్చి హాజరు పట్టీలో సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏముంది.?
ఈ మాటలు ఇంకెవరన్నా అంటే, అది రాజకీయ ఆరోపణ. పైగా, అభ్యంతరకరం. కానీ, ఈ వ్యాఖ్యలు చేసింది గౌరవ ప్రదమైన ‘స్పీకర్’ పదవిలో వున్న వ్యక్తి.
అందునా, స్పీకర్ ఛెయిర్‌లో కూర్చుని వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, వైసీపీ ఎమ్మెల్యలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
YSRCP MLAs AP Assembly.. ఎలెవెన్ మోహనం.!
2024 అసెంబ్లీ ఎన్నికల్లో 11 మంది వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అందులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఒకరు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా.!
గతంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయారు.
తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే, అసెంబ్లీకి వస్తానంటూ, చిన్న పిల్లాడు స్కూలుకెళ్ళడానికి చాక్లెట్ల కోసం మారాం చేసినట్లుగా వైఎస్ జగన్, చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
అపరిచితుడు వైఎస్ జగన్..
ప్రతిపక్ష హోదా వుండాలంటే, కనీసం 18 మంది ఎమ్మెల్యేలు వుండాలంటూ గతంలో, ఇదే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డే చెప్పారు.
ఇక, ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనేగానీ, అసెంబ్లీకి వచ్చేది లేదంటూ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్న వైఎస్ జగన్, శాసన మండలికి మాత్రం తమ సభ్యుల్ని పంపుతున్నారు.
జగన్ బాటలో, వైసీపీ శాసన సభ్యులెవరూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడంలేదు. కానీ, అసెంబ్లీలో హాజరు పట్టీ మాత్రం, వైసీపీ సభ్యుల సంతకాలతో నిండిపోతోందిట.
ఇదే విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సభలో ప్రస్తావించారు.
ప్రజా ధనం దోచిపెట్టకూడదు..
‘దొంగల్లా వచ్చి, సంతకాలు పెట్టి వెళ్ళిపోవడమెందుకు.? రాచ మార్గంలో దర్జాగా, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావొచ్చు కదా..’ అన్నది అయ్యన్న పాత్రుడి వాదన.
ఇదిలా వుంటే, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానప్పుడు, సదరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్నది జనం నుంచి వస్తున్న డిమాండ్.
Also Read: కష్టార్జితం ప్రజల కోసం.! జన సేవకై జనసేనాని.!
దొంగ సంతకాలు పెట్టే ఎమ్మెల్యేలకు, గౌరవ వేతనం రూపంలో ప్రజాధనాన్ని ఎలా దోచిపెడతారంటూ, ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదీ నిజమే మరి.!
ప్రజా స్వామ్యంలో ప్రజలే ప్రభువులు.! వాళ్ళ వాదనలోనూ నిజం వుంది. తాము కష్టపడి పన్నులు కడుతోంటే, ఆ సొమ్ముల్ని అడ్డగోలుగా వృధా చేస్తే, ప్రజలు ప్రశ్నించకుండా వుంటారా.?