Shweta Basu Prasad Oops.. ‘ఏలేలి పాలు ఓలుకమ్మా..’ ‘ఎ..కా..డా..’ అనే డైాలాగులతో అప్పట్లో తెగ ట్రెండింగ్ అయిన ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్.
అయ్యో.! ఈ అమ్మాయ్ పేరు కూడా మర్చిపోయుంటారులే. దాందేముందీ.! ఒకసారి గుర్తు చేసేస్తే పోలా.! అదేనండీ ‘కొత్త బంగారు లోకం’ అనే సినిమా గుర్తొచ్చిందా.!
యంగ్‌స్టర్స్ వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా తెరకెక్కి.. అప్పట్లో యూత్‌ని తెగ ఉర్రూతలూగించిన సినిమా. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిందీ సినిమా అప్పట్లో.
ఈ సెన్సేషనల్ మూవీతో హీరోయిన్‌గా పరిచయమై, అంతే సెన్సేషన్ అయిన ఫ్రెష్ అండ్ బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్. బోలెడంత స్టార్‌డమ్ రావాల్సింది ఈ అందగత్తెకి.
వివాదాల సావాసం.. కెరీర్ సర్వ నాశనం.!
కానీ, విధి మరోలా రాసుంది. అనుకోకుండా రకరకాల వివాదాలు శ్వేతా బసు ప్రసాద్‌ని చుట్టు ముట్టాయ్. దాంతో కెరీర్ అనూహ్యంగా అటకెక్కేసింది శ్వేతా బసుకి.

కోర్టు గొడవలు, కేసులు.. అంటూ చాలా ఇబ్బందుల్లో ఇరుక్కుపోయింది. దాంతో టాలీవుడ్‌లో శ్వేతా బసు ప్రసాద్‌కి అవకాశాలు తగ్గిపోయాయ్.
కొన్నాళ్లు పూర్తిగా టాలీవుడ్‌కి దూరమైపోయిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చింది కానీ, చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
Shweta Basu Prasad Oops.. నటి మాత్రమే కాదు సుమీ.. అంతకు మించి..
కేవలం నటి మాత్రమే కాదు, శ్వేతా బసు ప్రసాద్. రైటర్ కూడా. 24 ఫ్రేమ్స్‌లో చాలానే కళలున్నాయ్ శ్వేతా బసు ప్రసాద్‌లో.
ఆ టాలెంట్‌తోనే బాలీవుడ్‌లో నిలదొక్కుకుంది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఓటీటీ హవా చురుగ్గా వున్న నేపథ్యంలో ఓటీటీ కంటెంట్ వైపు దృష్టి పెట్టిందీ టాలెంటెడ్ యాక్ట్రెస్.
అలా శ్వేతా బసు నటించిని ఓ రీసెంట్ వెబ్ సిరీస్ ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అదే ‘ఊప్స్ – అబ్ క్యా హై’.
ఈ సిరీస్ మొదట అడల్ట్ కంటెంట్ ఫీల్ క్రియేట్ చేస్తుంది. కానీ, చూడగా చూడగా.. శ్వేత బసు ప్రసాద్‌ని మెచ్చుకోకుండా వుండలేం.
ఆ మాటకొస్తే.. ఈ సిరీస్‌లో నటించిన ప్రతీ ఆర్టిస్ట్ కూడా. చాలా చక్కగా భావోద్వేగాలు పండించారు. అందుకే ఓటీటీలో ఈ సిరీస్‌కి మంచి ఆదరణే దక్కుతోందని చెప్పొచ్చు.
Also Read: విశ్వక్ సేన్ ‘ఫంకీ’లో ‘డ్రాగన్’ బ్యూటీ.!
ఇక, శ్వేతా బసు గురించి మాట్లాడాల్సి వస్తే.. ఎన్నో రకాల భావోద్వేగాలు.. ఎంతో బరువైన పాత్రను చాలా అవలీలగా నటించేసింది ఈ సిరీస్‌లో.
వాస్తవంగా చెప్పాలంటే, టాలెంట్‌కి అసలు సిసలు అవకాశం ఓటీటీ కంటెంట్‌లోనే దక్కుతోందని చెప్పడం అతిశయోక్తి కాదేమో.
క్యూట్‌గా కనిపించింది.. నవ్వించింది.. ఏడిపించింది.. ఆలోచింపచేసింది.. ఈ పాత్రలో శ్వేతా బసు ప్రసాద్. సో, ఇప్పటికీ.. ఈ సిరీస్ మిస్ అయిన వాళ్లెవరైనా వుంటే హాయిగా ఓ లుక్కేసేయొచ్చు.!