Table of Contents
Ketika Sharma Adhi Dha Surprisu.. కేతిక శర్మ స్పెషల్ సాంగ్ చేసింది. అదే, ‘సర్‌ప్రైజు’ అంటూ ‘రాబిన్ హుడ్’ టీమ్ ముందస్తుగా ప్రమోషన్ యాక్టివిటీస్ చాలా గట్టిగానే చేయడం చూశాం.
పాట వచ్చింది, వివాదాస్పదమయ్యింది.! కాకపోతే, బాగా వైరల్ అయ్యిందీ పాట.! హుక్ స్టెప్‌ని వైరల్ చేసేందుకు కేతిక శర్మ, సోషల్ మీడియా వేదికగా శక్తి వంచన లేకుండా కృషి చేసింది.
నిజానికి, చాలా ఐటమ్ సాంగ్స్‌తో పోల్చితే, ఇదేమీ మరీ అంత అసహ్యంగా అనిపించదు. ఎందుకంటే, ఇంతకంటే దారుణమైన పాటల్ని చాలానే చూశాం.
ప్రముఖ హీరోయిన్లు.. అందునా, నెంబర్ వన్ హీరోయిన్లుగా చెలామణీ అవుతున్న అందాల భామలు కూడా, స్పెషల్ సాంగ్స్.. చేసేసి, వేడి వేడిగా తమ అందాల్ని తెరపై వడ్డించేశారు.
Ketika Sharma Adhi Dha Surprisu.. కాంట్రవర్సీ సర్‌ప్రైసు..
ఒకప్పుడు వీటినే వ్యాంప్ సాంగ్స్ అనీ, క్యాబరే డాన్సులనీ.. అనే వాళ్ళు. అప్పట్లో వీటి కోసం ప్రత్యేకంగా కొందరు నటీమణులుండేవారు.
జ్యోతి లక్ష్మి, జయమాలిని కాలం నుంచి.. సిల్క్ స్మిత వరకూ.. చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా చాలా పెద్దదే. లక్షలు పోసి, ఐటమ్ బాంబ్స్‌ని తీసుకొచ్చే రోజుల నుంచి కోట్లు కుమ్మరించేదాకా వచ్చింది పరిస్తితి.
నోరా ఫతేహీ.. ఫక్తు ఐటమ్ బాంబ్. ఊర్వశి రౌతెలా కూడా ఐటమ్ బాంబులా మారిపోయిన సంగతి తెలిసిందే. ఊర్వశి రౌతెలా మీద కూడా ఆ మధ్య కాంట్రవర్సీ నడిచింది.. డాన్స్ మూమెంట్స్ గురించి.
శేఖర్ మాస్టార్ పైత్యం..
ఆ ఊర్వశి రౌతెలాా సాంగ్‌కి కొరియోగ్రఫీ అందించింది కూడా శేఖర్ మాస్టరే.! అన్నట్టు, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటేనే అసహ్యం.. అనే స్థాయికి అతని పాటలు వివాదాస్పదమవుతున్నాయి.
‘రాబిన్ హుడ్’ సినిమాలోని ‘అదిదా సర్‌ప్రైసు’ పాట కూడా అలానే వివాదాస్పదమయ్యింది. వెంటనే, ఈ పాటని సినిమాలోంచి తొలగించాలనే డిమాండ్లు పుట్టుకొచ్చాయి.

మరోపక్క, కావాలని చేసింది కాదని చెబుతూనే, నాలుగైదు స్టెప్స్‌ని శేఖర్ మాస్టర్ డిజైన్ చేస్తే, అందులో తనకు ఆ స్టెప్ మాత్రమే నచ్చిందని దర్శకుడు వెంకీ కుడుముల చెప్పడం గమనార్హం.
ఎబ్బెట్టుగా అనిపించలేదా.?
పాట షూట్ చేస్తున్నప్పుడు ఎబ్బెట్టుగా ఏమీ అనిపించలేదనీ, నెగెటివిటీ చూశాక మాత్రం తనకూ అలానే అనిపించిందని వెంకీ కుడుముల తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఇంత కాంట్రవర్సీ నడుమ ఈ పాట సోషల్ మీడియాలో మాత్రం దూసుకుపోతోంది. సినిమాకి ఈ కాంట్రవర్సీ హెల్పవుతుందా.? వేచి చూడాల్సిందే.
అన్నట్టు, ‘రాబిన్ హుడ్’ హీరోయిన్ శ్రీలీల కూడా మొన్నీమధ్యనే ‘పుష్ప 2 ది రూల్’ సినిమాలో, ‘కిసిక్కు’ అంటూ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే కదా.!