Aakanksha Singh Khakee.. ‘మళ్ళీ రావా’ సినిమా గుర్తుందా.? అదేనండీ, సుమంత్ హీరోగా నటించిన సినిమా.! పోనీ, ‘దేవదాస్’ సినిమా గుర్తుందా.? అదేనండీ, నాగార్జున – నాని కలిసి నటించారు కదా.?
ఈ రెండు సినిమాల్లోనూ నటించింది ఆకాంక్ష సింగ్ కూడా.! తెలుగులో పలు ఇతర సినిమాల్లోనూ నటించినా, సరైన గుర్తింపు అయితే ఈ బ్యూటీకి రాలేదు.
అయినాగానీ, ఆకాంక్ష సింగ్‌కి అవకాశాలు బాగానే వస్తున్నాయ్. తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లోనూ క్షణం తీరిక లేకుండా నటిస్తూనే వుంది ఈ అందాల భామ.
Aakanksha Singh Khakee.. కొన్ని గాయాలు అలా.. మరికొన్ని ఇలా..
తాజాగా, ‘ఖాకీ’ అనే వెబ్ సిరీస్‌లో ఆకాంక్ష సింగ్ మెరిసింది. పోలీస్ అధికారి పాత్రలో నటించి మెప్పించింది ఆకాంక్ష సింగ్. ఆమె పాత్రకి చివర్లో ఓ బీభత్సమైన ట్విస్ట్ కూడా వుంటుంది లెండి.!
అసలు విషయమేంటంటే, ‘ఖాకీ’ వెబ్ సిరీస్ షూటింగ్ సందర్భంగా ఆకాంక్ష గాయపడింది. అలా గాయపడ్డం వల్ల తగిలిన గాయాల గురించి సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది కూడా.

నటీనటులకు సినిమా షూటింగుల్లో గాయాలు తగలడం కొత్తేమీ కాదు. సినిమా పట్ల వారి అంకిత భావానికి గుర్తులుగా ఈ గాయాల్ని చూస్తుంటారు.
అయినా, అందాల భామలు ఇలా కష్టపడి, దెబ్బలు తగిలించుకుంటే.. వాళ్ళ అభిమానుల గుండెలు విలవిల్లాడిపోవూ.!
కొన్ని నిజంగా తగిలిన గాయాలు కొన్ని. మేకప్ ఆర్టిస్ట్ క్రియేటివిటీతో కనిపించే గాయాలు కొన్ని.. అంటూ, ఆకాంక్ష తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పేర్కొంది.
పోలీస్ అధికారిణి కదా, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేయాల్సి వచ్చింది ఆకాంక్షకి ‘ఖాకీ’లో. బాగానే చేసేసింది వాటిని.