Table of Contents
Pithapuram MLA Pawankalyan Reporting.. దశాబ్దాల తరబడి రాజకీయాల్ని చూస్తున్నాం. ప్రజా ప్రతినిథులు, తమను గెలిపించిన ప్రజలకు నేరుగా తన ‘రిపోర్ట్ కార్డు’ని పంపించడం ఎప్పుడైనా చూశామా.?
ఇదిగో, ఇప్పుడు చూస్తున్నాం. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి, పిఠాపురం నియోజకవర్గానికి ఏమేం చేసిందీ, చేయబోతున్నదీ సవివరంగా పేర్కొన్నారు ఓ లేఖలో.
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు చెబుతూ, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఓ లేఖ రాశారు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
దీన్ని, ‘రిపోర్ట్ కార్డ్’గా అభివర్ణిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఇంతకు ముందెన్నడూ, ఏ రాజకీయ నాయకుడూ ఇలాంటి లేఖ రాసింది లేదన్నది వారి అభిప్రాయం.
Pithapuram MLA Pawankalyan Reporting.. లేఖలో ఏముందంటే..
పిఠాపురం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ప్రియమైన నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ విశ్సావను నామ నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.
ఎన్నో ఆశలతో, మరెన్నో ఆకాంక్షలతో తెలుగు వారి నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు తీసుకురావాలని శ్రీ పురుహూతికా అమ్మవారిని, శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారిని, శ్రీపాద వల్లభస్వామివారిని వేడుకుంటున్నాను.
పిఠాపురం నుండి మీరు ఎంతో ప్రేమాభిమానాలతో నన్ను మీ శాసనసభ్యునిగా ఎన్నుకున్న తర్వాత వస్తున్న తోలి ఉగాది ఈ విశ్వావన నామ సంవత్సరం పిఠాపురం సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి వాంది పలుకుతుందని నేను విశ్వసిస్తున్నాను.

మీరు నన్సు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరిచ్చిన విజయం వారు ఉపముఖ్యమంత్రి పదవితో పాటుగా, పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు అందించింది. బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో నేను రాష్ట్రవ్యాప్తంగా దృష్టి పెట్టాల్సి ఉంది.
నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినప్పటికీ, అనుక్షణం నా పిఠాపురం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాను. మాటలు చెప్పడం. కంటే పరి పూర్తి చేయడం ముఖ్యమని నేను భావిస్తాను.
నేను కనిపించడం కంటే నా పని మీకు కనిపించాలి. దాని ద్వారా మిమ్మల్ని మెప్పించాలి అనే ఉద్దేశ్యంతో గత పది నెలల కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలను దీర్ఘలాలిక సమస్యలను అధ్యయనం చేస్తూ, పరిష్కరిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
మోడల్ నియోజకవర్గంగా పిఠాపురం..
పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ పలు కార్యక్రమాలను చేపట్టాను. పిఠాపురం పరిసర ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ (PADA) ఏర్పాటు చేయడం జరిగింది.
వైద్య సదుపాయాన్ని మెరుగుపరిచేందుకు ప్రస్తుతం ఉన్న ఆసుపత్రులలో సౌకర్యాలు మెరుగుపరుస్తూ, నూతన సిబ్బందిని నియమిస్తూ తాత్కాలిక పరిష్కారం చేపడుతూనే అన్ని రకాల వైద్య సదుపాయాలతో 100 పడకల నూతన అసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చేలా కృషి చేయడం జరిగింది.
త్వరలో ఈ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం కానుంది. దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోక ఇబ్బంది పడుతున్న జగ్గయ్య చెరువు ప్రాంతాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు. 10 వేల మందికి పైగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా దాదాపు 20 కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వం నుండి ఆమోద ముద్ర వేయించడం జరిగింది.
ఎన్నో దశాబ్దాల నియోజకవర్గ ప్రజల కల అయిన సామర్లకోట – పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణన్ గారితో సంప్రదింపులు జరిపి కేంద్ర పథకం CRF ద్వారా ₹59.70 కోట్లతో నిర్మాణానికి అనుమతులు తీసుకురావడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే! దాదాపు 54 పైగా గ్రామాలకు రవాణా సమస్యలు మెరుగుపడతాయి.
అలాగే సుద్దగడ్డ, ఏలేరు వరివాహక ముంపు ప్రాంత ప్రజల సమస్యలకు చెక్ పెట్టేలా ఆధునికరణ పనులకు అనుమతులు సాధించడం జరిగింది. ఉప్పాడ బీచ్ రోడ్డు సమస్య పరిష్కారంతో పాటుగా, బీచ్ ఆధునికరలు కోసం, పిఠాపురం నియోజకవర్గంలో టూరిజం అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి పనులు ప్రారంభించడం జరిగింది.
వీటితో పాటుగా గొల్లలు డంపింగ్ యార్డ్ సమస్య నియోజకవర్గ త్రాగునీటి సమస్య పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి అడుగులు వేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి పిఠాపురం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం పిఠాపురం రైల్వే స్టేషన్ లో రైళ్లు ఆగేలా రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
నియోజకవర్గానికే తలమానికైమన పాదగయ కేత ప్రాశస్త్యాన్ని..
నియోజకవర్గానికే తలమానికమైన పాదగయ కేత ప్రాశస్త్యాన్ని ప్రతీ ఒక్కరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో గతంలో ఎన్నీరు లేని విధంగా దసరా. శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఉపాధి హామీ పథకం ద్వారా గత ప్రభుత్వంలో ఆగిపోయిన పనులు పునః ప్రారంభించి అభివృద్ధి కార్యక్రమాలు.. మొదలుపెట్టడం జరిగింది.
ఇలా అన్ని రంగాల్లో పిఠాపురం అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తూ, నాపై మీరు పెట్టుకున్నా నమ్మనాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాను.
భవిష్యత్తులో విఠాపురం గురించి దేశవ్యాప్తంగా చర్చించేలా, పిఠాపురం అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేయాలనేదే నా ఉద్దేశం. ఈ బృహత్యార్యానికి మీ అందరి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తూ, మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వావాను నామి నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.
Also Read: సనాతనంపై విషం: పాత్రికేయ వనంలో గంజాయి మొక్కలు.!
ఇదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, 2024 ఎన్నికల్లో తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు రాసిన లేఖ సారాంశం. రాజకీయమంటే, ప్రజా సేవ కోసమే.. అని జనసేనాని బలంగా నమ్ముతారు.
అందుకే, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత సంపాదన నుంచి కొంత మొత్తాన్ని వెచ్చించి, పిఠాపురం నియోజకవర్గం సహా, రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
అధికారం అంటే, కొందరికి పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. ప్రజా ధనంతో వ్యక్తిగత ప్రచారం చేసుకునే రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో, పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరులు మాత్రమే రాజకీయాల్లో మంచి మార్పు తీసుకురాగలరు.
పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తరహాలోనే, మొత్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, తమ తమ ప్రజల కోసం ఏమేం చేశారో, చేయబోతున్నారో.. సవివరంగా ఇలాంటి రిపోర్ట్ కార్డ్స్ ప్రజల ముందుంచితే బావుంటుంది.