Home » Priyanka Chopra: రాజమౌళి చెక్కిన ‘గ్లోబ్ ట్రోటర్ మందాకిని’!

Priyanka Chopra: రాజమౌళి చెక్కిన ‘గ్లోబ్ ట్రోటర్ మందాకిని’!

by Mudra369 Editorial Desk
0 comments
Priyanka Chopra Jonas Mandakini

Globetrotter Mandakini Priyanka Chopra.. రాజమౌళి సినిమాల్లో పాత్రలు చెక్కబడతాయి.! ఔను, వాటిని ఆయన అలా డిజైన్ చేస్తాడు.! అందుకే, రాజమౌళిని ‘జక్కన్న’ అంటుంటాం.!

మహేష్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గ్లోబ్ ట్రోటర్’ (టైటిల్ విషయమై భిన్న వాదనలున్నాయ్) నుంచి ఆల్రెడీ ‘కుంభ’ పాత్రని పరిచయం చేశారు.

‘కుంభ’ పాత్రలో, మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, హీరోయిన్ ప్రియాంక చోప్రా లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

Globetrotter Mandakini Priyanka Chopra.. మందాకిని ప్రియాంక..

ప్రియాంక చోప్రా జోనాస్ పాత్రకి ‘మందాకిని’ అనే పేరు పెట్టుకున్నాడు తన ‘గ్లోబ్ ట్రోటర్’ సినిమాలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.

‘వీల్ ఛెయిర్’ మీద ‘కుంభ’ పాత్రని పరిచయ చేసిన రాజమౌళి, చీరకట్టులో ‘మందాకిని’ పాత్రని పరిచయం చేయడం గమనార్హం.

Priyanka Chopra Jonas
Priyanka Chopra Jonas

వీల్ ఛెయిర్.. ఆపై, దానికి రోబోటిక్ ఆర్మ్స్.. ఇవన్నీ పెట్టి, హాలీవుడ్ రేంజ్ ‘స్పైడర్ మ్యాన్’ తరహా సినిమా ఏదో చేస్తున్నట్లు హైప్ క్రియేట్ చేసిన రాజమౌళి, ప్రియాంకని సంప్రదాయ వస్త్రధారణలో చూపించడం విశేషమే మరి.

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ప్రియాంక చేతిలో గన్.. ఆ స్టైలింగ్.. టాప్ క్లాస్ అంతే.! రాజమౌళి అంటే, ఆ రేంజ్ వుంటుంది మరి.!

Also Read: దేవస్థానం.. యాత్రా స్థలం.! ఆధ్యాత్మిక నిలయం.! సనాతన ధర్మం.!

తొలుత విలన్, ఆ తర్వాత హీరోయిన్.. చివరగా హీరో మహేష్ లుక్ రివీల్ కానున్న సంగతి తెలిసిందే.!

ఈ మేరకు కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా రాజమౌళి, మహేష్‌ ప్రియాంక చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్.. ఓ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ పెట్టుకున్నారు.

ఈ నెల 15న ఓ గ్లోబల్ ఈవెంట్ ద్వారా, ‘గ్లోబ్ ట్రోటర్’ గురించి చాలా చాలా చెప్పబోతోంది చిత్ర యూనిట్. ఇంతకీ, సూపర్ స్టార్ మహేష్ లుక్ ఎలా వుండబోతోంది.? జస్ట్ వెయిట్ అండ్ సీ.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group