Kodali Nani Health Condition.. కొడాలి నాని.. ఈ పేరుకి కొత్తగా పరిచయం అక్కర్లేదు.! ఎందుకంటే, ‘బూతు’కి ఆయన కేరాఫ్ అడ్రస్ మరి.!
టీవీ ఛానళ్ళలో కొడాలి నాని కనిపిస్తే చాలు, ‘బూతు.. బూతు..’ అని జనం చెవులు మూసుకుంటారు.! అంతలా, బూతులకి కొడాలి నాని బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు.
మహిళా జర్నలిస్టులు సైతం, కొడాలి నానిని ఇంటర్వ్యూ చేయాలంటే భయపడే పరిస్థితి వుంటుంది. ఎందుకింతలా ఆయన బూతులకు అడిక్ట్ అయిపోయినట్టు.?
ఎందుకంటే, బూతులే తన రాజకీయ భవిష్యత్తు.. అని ఆయన బలంగా నమ్మారు కాబట్టి. వైసీపీ హయాంలో కొడాలి నాని మంత్రిగా పని చేశారు.
Kodali Nani Health Condition.. బూతులే ఓడించాయ్..
కానీ, 2024 ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూశారు. అప్పటిదాకా ఓటమి ఎరుగని రాజకీయ చరిత్ర ఆయనది. తన బూతులే తనను ఓడించాయని కొడాలి నాని ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో.!
అసలు విషయమేంటంటే, కొడాలి నాని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండె సంబంధిత సమస్యతో హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో తొలుత చేరారాయన.
అయితే, గుండె వాల్వులు మూసుకుపోయాయని వైద్యులు నిర్ధారించగా, ముంబైకి ఆయన్ని మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక విమానంలో తరలించారు.
మరోపక్క, గత కొన్నాళ్ళుగా కొడాలి నాని కిడ్నీ సంబంధిత అనారోగ్యంతోనూ బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళన కరంగా మారింది.
క్షేమంగా తిరిగొస్తారు..
‘ఏం భయం లేదు.. తీవ్ర అనారోగ్యం ఏమీ కాదు. త్వరలోనే ఆయన కోలుకుని హుషారుగా తిరిగొస్తారు.. రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు..’ అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారనుకోండి.. అది వేరే సంగతి.
ఇదిలా వుంటే, కొడాలి నానిపై సోషల్ మీడియా వేదికగా కొన్ని అభ్యంతరకర పోస్టులు దర్శనమిస్తున్నాయి. ‘తప్పు కదా.?’ అని ఎవరైనా కామెంట్ చేస్తే, ‘తప్పేం లేదు’ అనే కౌంటర్ ఎటాక్ వస్తోంది.
Also Read: లీకు.! సచ్చిపోమాకు.! ‘ఆమె’ కూడా ‘అమ్మ’లాంటిదే.!
అధికార మదం తలకెక్కి, ఒళ్ళు తెలియని మైకంలో.. రాజకీయ ప్రత్యర్థుల్ని నిర్లజ్జగా తూలనాడారు కొడాలి నాని. ఈ క్రమంలో ‘అయ్యో పాపం’ అని ఎవరూ కొడాలి నాని మీద జాలి చూపించే పరిస్థితి లేదు.
చేసుకున్నోడికి చేసుకున్నంత.. అన్నమాట నిజమే అయినా, ‘కష్టం’ ఎవరికైనా కష్టమే కదా.! కొడాలి నాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం.!