Producer Naga Vamsi Sanctity.. నిర్మాత నాగ వంశీ, ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓ సినీ ఎర్నలిస్టుని ఏకి పారేశారు. తన సినిమాపై నెగెటివ్ రివ్యూ ఇచ్చి, నెగెటివ్ కామెంట్స్ చేయడాన్ని తట్టుకోలేకపోయారాయన.
అయితే, ఎక్కడా నాగ వంశీ, ఆ సినీ ఎర్నలిస్టు పేరుని ప్రస్తావించలేదు. ‘ఇంట్లో పెళ్ళాం మీద కోపమొస్తే, నెగెటివ్ రివ్యూలు ఇస్తారు’ అని కూడా నాగవంశీ మండిపడ్డారు.
అంతేనా, ‘దమ్ముంటే, నా సినిమాల్ని బ్యాన్ చెయ్.. నా ప్రెస్ మీట్లకు రావొద్దు.. నా సినిమాలకు రివ్యూలూ ఇవ్వొద్దు.. నా సినిమాలకు సంబంధించిన యాడ్స్ అడగొద్దు..’ అంటూ సవాల్ విసిరారు.
మనిషికొచ్చినంత కోపమొచ్చిందే..
అటు వైపు, ఆ సినీ ఎర్నలిస్టుకి ‘మనిషికి వచ్చినంత కోపం’ వచ్చేసింది. గుమ్మడికాయల దొంగ.. అనగానే, భుజాలు తడుముకున్నట్లు ‘ఆయన తిట్టింది నన్నే’ అని స్పందించేశాడు.
ఇంకో వీడియో విడుదల చేశాడు సదరు సినీ ఎర్నలిస్టు.! ‘నేను చెప్పిన కొన్ని పాయింట్లు మాత్రమే మీరు ప్రస్తావించి, వాటిని మాత్రమ మీరు తప్పు పట్టారంటే, మిగతా విషయాల్ని అంగీకరించినట్టే కదా.? అనేశాడు.
కామెడీ అంటే ఇదే మరి.! అవతలి వ్యక్తి.. గట్టిగా దవడ పగలగొడితే, ‘ఏయ్, నువ్వు రాలగొట్టింది ముప్ఫయ్ రెండు పళ్ళే కదా.. మిగతా పళ్ళను పగలగొట్టే దమ్ము నీకు లేనట్లే..’ అన్నట్లుంది వ్యవహారం.
Producer Naga Vamsi Sanctity.. కుక్కిన పేనులా..
నిజానికి, ఆ సినీ ఎర్నలిస్టు చెప్పాల్సిందేంటి.? ‘ఔను, నా మగతనం చూపిస్తా. ఇకపై, నీ సినిమాల్ని బ్యాన్ చేస్తా. నీ సినిమాల రివ్యూల జోలికి రాను. నీ సినిమాల యాడ్స్ అడగను..’ అని కదా అనాలి.!
సరే, ఆ ఎర్నలిస్టుకి, సదరు మీడియా సంస్థకీ.. ఎలాగూ అంత సీన్ లేదు.! బిచ్చగాళ్ళ కంటే హీనంగా తయారైంది వారి పాత్రికేయం.
నిర్మాత నాగ వంశీ సంగతేంటి.? తన సినిమాని చంపేసిన సదరు మీడియా సంస్థనీ, సదరు ఎర్నలిస్టునీ బ్యాన్ చేశారా.? లేదా.? అంత దమ్ముందా.? లేదా.?
Also Read: కట్టుకున్న భార్యని రోడ్డు మీదకు లాగేసిన ‘పాండిత్యం’.!
ప్రెస్ మీట్ పెట్టి, చెలరేగిపోవడం కాదు.. ఇప్పుడిక నాగ వంశీ కూడా, తానేంటో నిరూపించుకోవాల్సి వుంది. లేదంటే, మొరిగే కుక్క కరవదు.. అన్న చందాన ఈ వ్యవహారం కూడా.. అని అనుకోవాల్సి వుంటుంది.
ఈ ‘మొరిగే కుక్క కరవదు’ అన్న మాట, సదరు ‘ఇండియన్ 2 తాత’, సదరు మీడియా సంస్థ.. తోటి మీడియా ప్రతినిథుల దగ్గర అంటున్న మాటలు నాగ వంశీ దాకా చేరడంలేదా.? అన్న అనుమానాలూ లేకపోలేదు.
అవును మరి, నా వల్లే మీరు బతుకుతున్నారు.. అంటూ, నాగ వంశీ తన స్థాయికి మించిన వ్యాఖ్యలు చేసేశారు మరి.! ఇప్పుడాయన తన స్థాయి ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిందే.