Sreeleela Rashmika Robinhood Flop.. ఒక హీరో చేయాల్సిన ప్రాజెక్ట్ మరో హీరో చేతికి చిక్కడం.. అదృష్టం కలిసొచ్చి ఆయా ప్రాజెక్టులు హిట్లు, సూపర్ హిట్స్ అయిపోయిన సందర్భాలు అనేకం చూశాం.
అలాగే హీరోయిన్ల విషయంలోనూ. అయితే ఇక్కడ సందర్భం వేరే. ఓ హీరోయిన్ వదిలేసిన ప్రాజెక్ట్.. మరో హీరోయిన్ చేతికి చిక్కింది.
ఆ ఇద్దరి హీరోయిన్ల సినిమాలూ అక్కడా.. ఇక్కడా.. ఒకేసారి రిలీజ్ అవ్వడం.. ఇద్దరి సినిమాలూ ఫెయిల్యూర్ కావడం.. ఆ నేరం ఈ ముద్దుగుమ్మల మెడకే చుట్టుకోవడం జరిగింది.
Sreeleela Rashmika Robinhood Flop.. రష్మిక చేసుంటే హిట్ అయ్యేదేమో.!
ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మలు.? ఏంటా కథా.? అంటే.. వెంకీ కుడుముల – నితిన్ కాంబినేషన్లో వచ్చిన ‘రాబిన్ హుడ్’ సినిమా రీసెంట్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్గా మొదట రష్మిక మండన్నా నటించాల్సి వుంది. కానీ, బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా వుండడం వల్ల ఈ ప్రాజెక్ట్‌ని రష్మిక వదిలేసుకుంది.
ఆ ప్లేస్‌లో శ్రీలీల వచ్చి చేరింది. అసలే శ్రీలీలకి ‘ఐరెన్ లెగ్’ అనే ముద్ర పడిపోయింది టాలీవుడ్లో. ఆమె ఏ సినిమా చేసినా నో డౌట్ ఆ సినిమా ఫ్లాప్ అని.

కానీ, ‘రాబిన్ హుడ్’తో ఆ నింద పోతుందనుకున్నారంతా. కానీ, తప్పించుకో్లేకపోయింది శ్రీలీల. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది.
శ్రీలీల ముచ్చట ఇలా వుంటే, అటు రష్మిక మండన్నా.. ఈమె నటించిన బాలీవుడ్ మూవీ ‘సికిందర్’ కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. సరే ఫెయిలైతే అయ్యింది కానీ, అది రష్మిక ఖాతాలో పడిపోయింది. ఇంతవరకూ రష్మిక నటించిన సినిమాలన్నీ హిట్సూ.. సూపర్ హిట్సే.
ఇలా ఎందుకు జరిగింది రష్మికా.!
కానీ, ‘సికిందర్’ విషయంలో ఎందుకో తేడా కొట్టేసింది. అదీ తాను తెలుగులో వదులుకున్న ప్రాజెక్ట్ రిలీజ్ డే రోజే రావడం.. అక్కడ ఆ సినిమా ఫెయిలవ్వడం.. ఇక్కడ ఈ సినిమా ఫెయిలవ్వడం.. రెండూ ఒకేసారి జరిగిపోయాయ్.

అదేంటో.! అటు రష్మిక అడృష్టం కాస్తయినా శ్రీలీలకి దక్కి వుంటే బాగుండేది. అలాగే, ఆ కారణంతో ఆ ప్రాజెక్ట్ వదులుకున్నందుకు బాలీవుడ్లో రష్మిక సినిమా హిట్ అయినా బాగుండేది.
Also Read: ఛ.! నిజమా.? నీకెవరు చెప్పారు పాయల్.?
పాపం.! రష్మిక పరిస్థితే రెంటికీ చెడిన రేవడిలా మారింది. అటు శ్రీలీల.. ‘రాబిన్‌హుడ్’ సినిమా పైనే ఎన్నో ఆశలు పెట్టుకుంది.!
సరె సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం.! అన్నీ జరుగుతాయా ఏంటీ.!