Telugu Cinema Webchaaram.. ఇదో సినీ ఎర్నలిస్టు కథ.! కథ కాదు, వ్యధ.! జర్నలిజం ముసుగులో బ్లాక్‌మెయిలింగ్ వ్యవహారాలు నడుపుతాడని అతని మీద బోల్డంత నెగెటివిటీ వుంది.
అయితేనేం, సోషల్ మీడియాలో బోల్డంత మంది ఫాలోవర్లు వున్నారు. పైగా, ఓ ప్రముఖ వెబ్ సైట్‌లో పని చేస్తున్నాడు. దాంతో, తమ సినిమాలకు నష్టమొస్తుందేమోనని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు సినీ జనాలు.
నిజానికి, అతన్ని ఓ వైపు వాడుకుంటున్నారు, ఇంకో వైపు తూలనాడుతున్నారు కూడా.! తాజాగా, ఓ సినీ ప్రముఖుడికి అతని తీరు మీద ఆగ్రహం కలిగింది.
కొద్ది రోజుల క్రితం ఇంకో సినీ ప్రముఖుడు, ఆ సినీ ఎర్నలిస్టుని పేరు ప్రస్తావించకుండానే ఏకి పారేశాడు. ఎందుకంత భయం.? పేరు ప్రస్తావించి అనాలనుకున్నది, అనేయొచ్చు కదా.!
Telugu Cinema Webchaaram.. వెబ్‌చారమ్ కబుర్లు.!
ఇంకోపక్క, అన్ని వైపుల నుంచీ తన వైపుకు విమర్శల బాణాలు దూసుకొస్తోంటే, ‘అందరం చేస్తున్నది అదే కదా’ అంటూ, ‘వెబ్’చారమ్ కథలు చెప్పడం మొదలు పెట్టాడు.
సినిమాకి సంబంధించి, నిర్మాణంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలుంటాయి. క్రేజీ కాంబినేషన్లు, స్పెషల్ సాంగ్స్, స్పెషల్ అప్పీయరెన్స్.. ఇలాంటివన్నమాట.
వాటి గురించి, సమయం చూసి.. ఒక్కో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వదులుతుంటాయి నిర్మాణ సంస్థలు. నటీనటులు, దర్శకులు కూడా, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రివీల్ చేస్తుంటారు.
సినీ మీడియా పనేంటి.? ఆ వివరాల్ని జనాలకి తెలియజేయడం. అంతేగానీ, సినిమా టీమ్ సీక్రెట్‌గా వుంచుతున్న వివరాల్ని లీక్ చేయడం జర్నలిజం ఎలా అవుతుంది.?
సినీ పరిశ్రమ చేతకానితనమ్..
దొంగతనం అవుతుందిది.! ఔను, నిజంగానే దొంగతనం.! చేసిందే దొంగతనం.. దొరికిన దొంగ ఏం చేస్తాడు.? నేనొక్కడినే దొంగనా.? వాడు కూడా దొంగే.. అంటాడు.!
ఇదీ, ఇలా నడుస్తోంది సినీ ‘వెబ్’ చారమ్.! ఇంట్రెస్టింగ్ విషయాల్ని అప్డేట్స్‌గా ఇవ్వడం తప్పు కాదు.! కానీ, కొన్నటికి సీక్రెసీ వుంటుంది కదా.! ముందే రివీల్ అయిపోతే, ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది కదా.?
Also Read: నాగవంశీ.! నిజంగానే నీకు అంత దమ్ముందా.!
కడుపుకి అన్నం తింటే, ఇవన్నీ అర్థమవుతాయ్.! కానీ, ‘నేను చేసిన వ్యభిచారమే నువ్వూ చేస్తున్నావ్’ అని, పచ్చి వ్యభిచారుల్లా సోషల్ మీడియాకెక్కి తిట్టుకునే అశుద్ధ భక్షకులకి ఇదంతా ఎలా అర్థమవుతుంది.?
అయినా, తప్పంతా సినీ పరిశ్రమదే.! ఆ వైరస్ ఏంటన్నది తెలుసు.. ఎలాంటి వ్యాక్సిన్ వెయ్యాలో తెలుసు. కానీ, చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు సినీ పెద్దలు.
ఇలాంటి పరాన్న జీవుల కారణంగా, సినీ పరిశ్రమ ఎంత నష్టపోతోందో.. సినీ జనాలందరికీ తెలుసు. తెలిసీ, ఉపేక్షిస్తున్నారంటే.. ఈ బలహీనతకి ఏం పేరు పెట్టాలి.?