Home » సినీ సంక్రాంతి: వసూళ్ళ పుంజులు ఇవే.!

సినీ సంక్రాంతి: వసూళ్ళ పుంజులు ఇవే.!

by hellomudra
0 comments

 సంక్రాంతి (Sankranthi) అంటే తెలుగు వారికి పెద్ద పండుగ. తెలుగు సినిమాలకీ (Telugu Cinema) సంక్రాంతి చాలా పెద్ద పండుగ. అందుకే, సంక్రాంతి కోసం పెద్ద సినిమాలు బరిలోకి దిగుతుంటాయి. స్టార్‌ హీరోలు, సంక్రాంతి (Sankranthi) బరిలో కోడి పుంజుల్లా (Kodi punjulu) తమ సత్తా చాటేందుకు దిగుతారు. 2018 సంక్రాంతి నిరాశపర్చింది. బాలకృష్ణ ‘జై సింహ’, పవన్‌కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమాలతో నిరాశపరిచారు.

2017లో బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ (Gauthami Putra Sathakarni) సినిమాతో సత్తా చాటితే, చిరంజీవి (Mega Star Chiranjeevi) చాలా ఏళ్ళ తర్వాత ‘ఖైదీ నెంబర్‌ 150’ (Khaidi No.150) సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చి, సంచలన విజయాన్ని అందుకున్న విషయం విదితమే.

మరి, 2019 సంక్రాంతి ఎలా వుండబోతోంది.? ఎవరెవరు బరిలో నిలిచారు.? అంటే, ఇప్పటికైతే ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama), ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ (NTR Kathanayakudu), ‘ఎఫ్‌2’ (F2) సినిమాలు ఖరారయ్యాయి గనుక.. రామ్‌చరణ్‌ (Mega Power Star Ram Charan), బాలకృష్ణ (Balayya), వరుణ్‌తేజ్‌ (Mega Prince Varun Tej), వెంకటేష్‌ (Victory Venkatesh) రేసులో నిలిచారని చెప్పొచ్చు.

బోయపాటితో మెగా పవర్‌ స్టార్‌..

మాస్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ బోయపాటి శ్రీను (Boyapati Sreenu). బాక్సాఫీస్‌ రికార్డుల్ని తిరగరాయడంలో దిట్ట మెగా పవర్‌ స్టార్‌. ఈ ఇద్దరి కలయికలో సినిమా అంటే, ఆ అంచనాలు ఓ రేంజ్‌లో వుంటాయి. అవును, ‘వినయ విధేయ రామ’ సినిమాపై అంచనాలు అందుకే ఆకాశాన్నంటేశాయి. చరణ్‌ సరసన ఈ సినిమాలో ‘భరత్‌ అనే నేను’ ఫేం కైరా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళనటుడు ప్రశాంత్‌, ఈవీవీ సత్యనారాయణ తనయుడు ఆర్యన్‌ రాజేష్‌ ఈ సినిమాలో చరణ్‌కి సోదరుల్లా కన్పించబోతున్నారు.

‘రంగస్థలం’తో (Rangasthalam) సంచలన విజయాన్ని నమోదు చేసి, 125 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్‌ అయిన చరణ్‌, ఈసారి 150 కోట్ల వసూళ్ళ లక్ష్యంతో ‘వినయ విధేయ రామ’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. చరణ్‌కి వున్న స్టార్‌డమ్‌ని పదింతలు పెంచేలా ఈ సినిమా వుండబోతోందని ట్రైలర్‌తోనే మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను చెప్పకనే చెప్పేశాడు. సో, ఈ సంక్రాంతికి విడుదలవుతున్న ‘వినయ విధేయ రామ’ సూపర్‌ హిట్‌ అని మెగా అభిమానులు ఫిక్సయిపోవచ్చన్నమాట.

సంక్రాంతి హీరో బాలయ్యే!

2017లో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా, 2018లో ‘జై సింహా’ సినిమా.. అదేంటో, బాలయ్య ప్రతి సంక్రాంతికీ తన సినిమా వుండాలనుకుంటుంటాడు.. హిట్టవ్వాలనే కసితో కన్పిస్తుంటాడు. తెలుగు సినిమా (Telugu Cinema) వరకూ సంక్రాంతి (Sankranthi) హీరో అంటే బాలయ్యే. సంక్రాంతికి విడుదలైన బాలయ్య సినిమాల్లో చాలావరకు సూపర్‌ హిట్స్‌ అయ్యాయి. ఒకటీ రెండూ తేడా కొట్టినా, ఓవరాల్‌గా బాలయ్య సంక్రాంతి ట్రాక్‌ రికార్డ్‌ మాత్రం మెరుగ్గానే వుంది ఇతర హీరోలతో పోల్చితే. ఈసారీ సంక్రాంతికి బంపర్‌ హిట్‌ కొడతానంటున్నాడు బాలయ్య.

తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తోన్న బాలయ్య, ఆ ‘ఎన్‌టిఆర్‌ కథానాయకుడు’ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. బాలయ్య ఈ చిత్రానికి నిర్మాత కూడా. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రానికి దర్శకత్వం వహించిన విలక్షణ దర్శకుడు క్రిష్‌ ఈ ‘ఎన్‌టిఆర్‌ బయోపిక్‌’ బాధ్యతల్ని తన భుజానికెత్తుకున్నాడు. సంక్రాంతికి ‘ఎన్‌టిఆర్‌ కథానాయకుడు’ వస్తోంటే, దానికి కొనసాగింపు అయిన ‘ఎన్‌టిఆర్‌ మహానాయకుడు’ జనవరి నెలాఖరున రాబోతోన్న సంగతి తెల్సిందే.

దగ్గుబాటి రాణా (Rana Daggubati), విద్యా బాలన్‌ (Vidya Balan), నిత్యామీనన్‌ (Nithya Menon), రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), సుమంత్‌, కళ్యాణ్‌రామ్‌ (Kalyan Ram), ప్రకాష్‌ రాజ్‌.. ఇలా చాలామంది ప్రముఖ నటీనటులు ఈ ‘ఎన్‌టిఆర్‌ బయోపిక్‌’ అనే మహాయజ్ఞంలో భాగస్వాములయ్యారు.

సంక్రాంతి (Sankranthi) అల్లుళ్ళు.. ఆ ఇద్దరూ.!

సోదరుడు రామ్‌చరణ్‌తోనే పోటీకి దిగుతున్నాడు ఈ సంక్రాంతికి మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ‘ఎఫ్‌2’ సినిమాతో. ఈ సినిమాకి అనిల్‌ రావిపూడి దర్శకుడు. టాలీవుడ్‌లో నలుగురు అగ్రహీరోల్లో ఒకరైన వెంకటేష్‌ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇదొక మల్టీస్టారర్‌.

వెంకటేష్‌, వరుణ్‌.. తోడల్లుళ్ళలా నటిస్తున్నారు ఈ ‘ఎఫ్‌2’ సినిమాలో. తమన్నా (Tamannah Bhatia), మెహ్రీన్‌కౌర్‌ (Mehreen Kaur Pirzada) హీరోయిన్లు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. అన్నట్టు, ‘వినయ విధేయ రామ’ చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందిస్తుండడం గమనార్హం.

ఏదిఏమైనా, సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా.. సినిమాల్లో కంటెంట్‌ వుంటే ప్రేక్షకులు అన్ని సినిమాల్నీ ఆదరిస్తారు. 2017 సంక్రాంతికి (Sankranthi) ‘ఖైదీ నెంబర్‌ 150’, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలతోపాటు, చిన్న సినిమా ‘శతమానం భవతి’ కూడా విడుదలై మంచి విజయాల్ని అందుకున్న సంగతి తెల్సిందే.

2019 సంక్రాంతి కూడా తెలుగు సినీ పరిశ్రమకి (Telugu Cinema Industry) కాసుల పంట పండించాలంటే, ‘వినయ విధేయ రామ’, ‘ఎన్‌టిఆర్‌ కథానాయకుడు’, ‘ఎఫ్‌2’ సినిమాలు విజయాల బాట నడవాల్సిందే.. నడుస్తాయని ఆశిద్దాం.

టీజర్‌ రివ్యూ: కొణిదెల ‘వీర’త్వం!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group