Home » యువరాజు ‘కేటీఆర్‌’ పట్టాభిషేకం

యువరాజు ‘కేటీఆర్‌’ పట్టాభిషేకం

by hellomudra
0 comments

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ (TRS Working President KTR) గా కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌ KTR) పట్టాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమం కోసం తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచీ పెద్దయెత్తున టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తరలివచ్చారు. దాంతో తెలంగాణ భవన్‌ పరిసర ప్రాంతాలు గులాబీమయంగా మారాయి. ‘యువరాజు’ పట్టాభిషేకానికి సంబంధించి ఎప్పటినుంచో జరుగుతున్న ప్రచారం నిజమైంది.

తన వారసుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (Kalvakuntla Chandrasekhar Rao), తన కుమారుడు కేటీఆర్‌ పేరుని ప్రకటించిన విషయం విదితమే. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించడం ద్వారా పార్టీ పగ్గాల్ని దాదాపుగా కేటీఆర్‌ చేతికి అప్పగించేశారు కేసీఆర్‌ (KCR). తద్వారా తాను జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టాలన్నది కేసీఆర్‌ ఆలోచన. ‘అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడు..’ అన్న కోణంలోనే కేటీఆర్‌ నియామకం జరిగింది.

కేటీఆర్‌ (TRS Working President KTR) .. తండ్రికి తగ్గ తనయుడు..

రాజకీయ వ్యూహాలు రచించడంలో తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్‌ పేరొందారు. అమెరికాలో గొప్ప ఉద్యోగం వదులకుని, తెలంగాణ ఉద్యమంలో తండ్రికి బాసటగా నిలిచారు కేసీఆర్‌. ఈ క్రమంలో కేటీఆర్‌పై చాలా ఆరోపణలు వచ్చాయి. ఎన్ని అవమానాలు ఎదురైనా, ధైర్యంగా నిలబడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచారు.. తెలంగాణ ఉద్యమంలో మరింత ఉధృతంగా పనిచేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో (Telangana Rashtra Samithi) కేటీఆర్‌ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పార్టీ కోసం కింది స్థాయి కార్యకర్తలా చెమటోడ్చిన కేటీఆర్‌, తండ్రికి అవసరమైన ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచారు. రాజకీయ వ్యూహాలు తన తండ్రి వద్దనే ఔపోసన పట్టిన కేటీఆర్‌, అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో తండ్రికి పూర్తి మద్దతు తెలిపారు.

గ్రేటర్‌ కేటీఆర్‌.!

నిజానికి, ఎమ్మెల్యేగా సత్తా చాటి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినా, కేటీఆర్‌ విశ్వరూపం మాత్రం గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లోనే కన్పించింది. 100 స్థానాలు కొల్లగొడ్తాం.. అని చెప్పి మరీ, గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేశారు. 100కి ఒక్కటి తక్కువ.. అంటే, 99 సీట్లు గెలిచింది టీఆర్‌ఎస్‌.

గ్రేటర్‌లో అసలు టీఆర్‌ఎస్‌కి (TRS) బలమెక్కడ.? అని ప్రశ్నించినవారే గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడే కేటీఆర్‌ విశ్వరూపమేంటో అందరికీ తెలిసింది. గ్రేటర్‌ హైద్రాబాద్‌ (Greater Hyderabad) పరిధిలో పార్టీ ఫిరాయింపులు అప్పట్లో కేటీఆర్‌ కనుసన్నల్లోనే నడిచాయనడం అతిశయోక్తి కాదు.

అసెంబ్లీ ఎన్నికలకు అన్నీ తానే అయి..

తెలంగాణ (Telangana) అసెంబ్లీని రద్దు చేసి, కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు (Telangana Assembly Elections) వెళితే, టిక్కెట్ల ఎంపిక దగ్గర్నుంచి, ఎన్నికల ప్రచారం వరకూ అన్ని విషయాల్లోనూ తండ్రికి చేదోడువాదోడుగా నిలిచారు. మొత్తం జిల్లాల్ని కేసీఆర్‌ చుట్టి వచ్చేస్తే, గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిని కేటీఆర్‌ కవర్‌ చేస్తూనే, తన సొంత నియోజకవర్గంలోనూ ఫోకస్‌ పెట్టారు. టీఆర్‌ఎస్‌ 88 సీట్లలో విజయం సాధించిందంటే, కేసీఆర్‌ ఇమేజ్‌తోపాటు.. కేటీఆర్‌ కష్టం కూడా అందులో వుందన్నది నిస్సందేహం.

బావతో గొడవలు లేనే లేవ్‌.!

బావ హరీష్‌రావుతో కేటీఆర్‌కి వివాదాలంటూ మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘మెజార్టీ విషయంలో మేమిద్దరం పోటీ పడ్తున్నాం, ఒకర్ని మించి ఇంకొకరికి మెజార్టీ రావాలని కోరుకుంటున్నాం..’ అంటూ ఆరోగ్యకరమైన పోటీకి తెరలేపారు కేటీఆర్‌. హరీష్‌ (Harish Rao) తరఫున కేటీఆర్‌, కేటీఆర్‌ తరఫున హరీష్‌ మాట్లాడుతోంటే తెలంగాణ సమాజం మురిసిపోయింది.

అయితే, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ (TRS Working President KTR) పదవి విషయంలో హరీష్‌ పేరుని కేసీఆర్‌ ప్రతిపాదించి వుంటే బావుండేదన్నది కొందరి వాదన. కేటీఆర్‌ వైపు కేసీఆర్‌ మొగ్గు చూపడంతో, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇకపై హరీష్‌రావు హవా వుండదంటూ కొందరు గులాబీ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. కానీ, కేసీఆర్‌ మాటను ‘మేనల్లుడు’ హరీష్‌రావు జవదాటే పరిస్థితే లేదు. కేటీఆర్‌కి బెస్ట్‌ విషెస్‌ని ఆల్రెడీ హరీష్‌రావు అందించారు, కేటీఆర్‌ పట్టాభిషేకానికీ హాజరయ్యారు.

పార్టీని మరింత పటిష్టం చేస్తా: కేటీఆర్‌

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ (KTR TRS Working President) పదవి అనేది బాధ్యత అనీ, ఇంత పెద్ద బాధ్యత తన మీద పెట్టిన కేసీఆర్‌ నమ్మకాన్ని వమ్ము చేయబోననీ, పార్టీని మరింత పటిష్టం చేస్తాననీ, తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండా సగర్వంగా ఎగిరేలా చేస్తాననీ కేటీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వ్యాఖ్యానించారు. ఆల్‌ ది బెస్ట్‌ టు కేటీఆర్‌.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group