Dhoni Hands Up CSK.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు, క్లీన్ బౌల్డ్ అయిపోయింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టుది అట్టడుగు స్థానం.
అసలెందుకీ పరిస్థితి.? వయసైపోయిన ధోనీ తప్ప, ఆ జట్టుకి వేరే దిక్కు లేదా.? ధోనీకి ఆడాలనే ఆశ వుంది.. కాదనలేం. కానీ, అతనిలో మునుపటి ఫామ్ ఏదీ ఎక్కడ.?
ధోనీ అంటే ఎలా వుండేవాడు.? ఎలాంటి పరిస్థితుల్లో అయినా టీమ్‌ని గెలిపించేవాడు. వికెట్ల వెనకాల వుంటూ, బౌలర్లకు సరైన దిశా నిర్దేశం చేసేవాడు.
హెలికాప్టర్ సిక్స్ కొడితే, ఆ ఎంటర్టైన్మెంట్ వేరే లెవల్‌లో వుండేది. ధోనీ గనుక ఔట్ అన్నాడంటే, ఔట్ అయిపోయినట్లే.! అలా వుండేది ధోనీ రివ్యూ సిస్టమ్.
Dhoni Hands Up CSK.. ఖేల్ ఖతమ్ దుకాణ్ బంద్
చెన్నయ్ జట్టు మీద బెట్టింగులు ఓ రేంజ్‌లో నడిచేవి. అంతలా ఐపీఎల్‌లో ధోనీ టీమ్ సీఎస్కే స్టార్‌డమ్ సంపాదించుకుంది. కానీ, అదంతా గతం. ఇప్పుడంతా నీరసం.
అసలు కెప్టెన్, గాయం కారణంగా దూరమైతే, విధిలేని పరిస్థితుల్లో ధోనీ కెప్టెన్సీ చేయాల్సి వస్తోంది. ధోనీ అంటే ఎవరు.? మ్యాచ్ ఫినిషర్.. కానీ, ఇదివరకటి స్పార్క్ అతనిలో లేదు.

ఒకట్రెండు స్టంపింగ్స్ బాగానే చేశాడు ధోనీ. కొన్ని మ్యాచ్‌లలో అభిమానుల్ని అలరిస్తూ భారీ సిక్సర్లూ బాదాడు. అంతకంటే, ధోనీ ఏం చేయగలడు.? కానీ, అదీ సరిపోదు.
‘జట్టులో అందరూ ఫెయిలవుతోంటే, ఏం చేయగలం.?’ అనేశాడు తాజా పరాజయం తర్వాత ధోనీ. నిజమే, ధోనీ ఆవేదననీ అర్థం చేసుకోవాల్సిందే.
ఆల్ ఫెయిల్..
టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్.. ఇలా అంతా ఫెయిలవుతున్నారు బ్యాటింగులో. బౌలింగ్ ఫర్లేదంతే. ఫీల్డింగ్ కూడా అదే పరిస్థితి. ఓవరాల్‌గా అన్ని విభాగాల్లోనూ చెన్న్ సూపర్ కింగ్స్ జట్టు ఫెయిలయ్యింది.
Also Read: పవన్ కళ్యాణ్ చివరి చిత్రం! పచ్చ కుల మీడియా పైత్యం!
ఈ సీజన్ వరకూ, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు మీద ఎలాంటి ఆశలూ లేవు. ధోనీ వైట్ ఎలిఫెంట్‌లా మిగిలిపోయాడు. వెరసి, ఈ ఏడాది చెన్నయ్ సూపర్ కింగ్స్ అభిమానులకి తీవ్ర నిరాశే.
సొంత మైదానంలో ఓటమి చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు అభిమానుల్ని మరింత ఆవేదనకు గురిచేస్తోంది. ఈ సీజన్‌కి ఇంతే. వచ్చే సీజన్‌కి అయినా, జట్టులో కొత్త రక్తం అవసరం.