Table of Contents
Robo Surgeon Coming Soon.. ఓ రోబో, ఆపరేషన్ థియేటర్‌లో రోగికి సర్జరీ చేసేస్తోంది.! ఆ ఆపరేషన్ థియేటర్‌లో ఒక్క డాక్టర్ కూడా లేకుండానే, సర్జరీ విజయవంతంగా పూర్తయిపోయింది.!
భవిష్యత్ సర్జరీల ముఖ చిత్రమిది.! ఔను, ఇప్పటిదాకా రోబోటిక్ ఆర్మ్ గురించే వింటూ వస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్య రంగంలో వినియోగించడం రోజు రోజుకీ పెరుగుతోంది.
కీలకమైన సర్జరీల విషయంలో అత్యంత ఖచ్చితత్వం కోసం ఈ రోబోటిక్ ఆర్మ్ వినియోగం పెరుగుతూ వస్తోంది. వైద్యులూ, వీటినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.
Robo Surgeon Coming Soon.. రోబోటిక్ ఆర్మ్ నుంచి పూర్తి స్థాయి రోబో డాక్టర్ వరకూ..
వాస్తవానికి రోబోటిక్ ఆర్మ్‌ని ఓ డాక్టర్ లేదా కొందరు డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తుంటుంది. ఆ పర్యవేక్షణ అనేది ఆపరేషన్ థియేటర్ నుంచి గానీ, కొంత దూరం నుంచి గానీ జరగొచ్చు.
విదేశాల నుంచి కూడా ఈ మధ్య రోబోటిక్ ఆర్మ్‌ని పర్యవేక్షించగలుగుతున్నారు డాక్టర్లు. దానికి, ఆపరేషన్ థియేటర్‌లో వుండే వైద్యుల సహకారం కూడా అవసరం.
అదే పూర్తి స్థాయి రోబో అయితే, ఇక వైద్యుల పర్యవేక్షణ అవసరం లేకుండా పోవచ్చు. ఆపరేషన్ థియేటర్‌లోకి పేషెంట్ వెళితే, అక్కడ ఆ పేషెంటుకి పూర్తిస్థాయిలో సర్జరీ ఆ రోబోనే చేసేస్తుందట భవిష్యత్తులో.
ఆసుపత్రి నిండా రోబోలే.. డాక్టర్లతో పనేం లేదు..
ఆసుపత్రికి రోగి వెళితే చాలు, అక్కడి నుంచి అన్నీ రోబోలో చేసేస్తాయి. అంటే, రిసీవింగ్ దగ్గర్నుంచి రక్త పరీక్షలు, వైద్య చికిత్సలు.. ఇవన్నీ అన్నమాట.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని, ఏ రోగికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వున్నాయో రోబోలు కనిపెట్టగలుగుతాయి. అవసరమైన మందుల్నీ ప్రిస్క్రైబ్ చేసేస్తాయి.
సెలైన్ పెట్టడం, ఆసుపత్రిలో వున్నప్పుడు బీపీ, బ్లడ్ షుగర్ వంటివి చెక్ చెయ్యడం.. ఇతరత్రా వైద్య పరీక్షలు.. ఇవన్నీ రోబోలు చేసే పనులే.
నర్సులూ, డాక్టర్లూ.. ఇక అంతేనా.?
మెడ్‌ట్రానిక్ అనే సంస్థ రూపొందించిన రోబో ఏకంగా 137 రకాల సర్జరీలు చేయగలదు. సర్జరీ సక్సెస్ రేట్ 85 శాతానికిగాను అంచనా వేస్తే, 98.5 శాతం వరకు సక్సెస్ రేట్ వచ్చిందట.
రోబో చేసిన 137 సర్జరీలలో కేవలం రెండింటికి మాత్రమే, తిరిగి సాధారణ సర్జరీ చేయాల్సి వచ్చిందట. అంటే, ఇది మామూలు సక్సెస్ రేట్ కాదన్నమాట.!
Also Read: తప్పు మేడమ్.! మీరలా ప్రశ్నించకూడదు.!
ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నవన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి కొంత కాలం పట్టొచ్చు. అదెంత త్వరగా.? అన్నది, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం తాలూకు వేగాన్ని బట్టి వుంటుంది.
జస్ట్ ఐదు, పదేళ్ళలోనే.. ఆసుపత్రుల్లో వైద్యులు అవసరం లేని పరిస్థితి రావొచ్చన్నది ఓ అంచనా. అదే జరిగితే, వైద్య వృత్తిపై మమకారం పెంచుకుంటున్న యువత పరిస్థితి ఏంటి.?
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.!