Capital Amaravati Re Launch.. పునఃప్రారంభం అనాలా.? పునర్నిర్మాణం అనాలా.?
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో.. ఇంకోసారి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ‘కార్యక్రమం’ ప్రారంభం కాబోతోంది.
గతంలో చెంబుడు నీళ్ళు, గుప్పెడు మట్టి.. ఇవే తీసుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ.. అనే విమర్శలొచ్చాయ్. ఈపారి పరిస్థితి ఏంటి.? ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఎం తీసుకొస్తున్నారు.?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వేరే శతృవులు అక్కర్లేదు. రాష్ట్రంలోని రాజకీయమే, రాష్ట్రానికి ప్రధాన శతృవు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
Capital Amaravati Re Launch.. అమరావతి.. ఐదేళ్ళ విధ్వంసం.!
వైసీపీ హయాంలో, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి విధ్వంసానికి గురయ్యింది.! ‘కమ్మరావతి’, ‘స్మశానం’, ‘ఎడారి’, ‘ముంపు ప్రాంతం’.. ఇవీ వైసీపీ ఇచ్చిన బిరుదులు.!

అమరావతిలోని మహిళా రైతుల్ని ఉద్దేశించి, కూకట్పల్లి ఆంటీలు.. అంటూ, వైసీపీ వెటకారాలు చేసిన పరిస్థితుల్నీ చూశాం. ఇంతలా ఓ రాజకీయ పార్టీ, రాష్ట్ర రాజధానిపై విషం చిమ్మడం.. ఎక్కడా కనీ వినీ ఎరగనిది.
అసలంతలా వైసీపీ, అమరావతి మీద ఎందుకు పగబట్టేసింది.? 2019 – 2019 మధ్యకాలంలో రాజధానిగా నిర్ణయించబడ్డ అమరావతి అభివృద్ధి పనుల్ని, వైసీపీ ఎందుకు ముందుకు నడిపించలేకపోయింది.?
రాజధాని.. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం..
గతం గతః ఆలస్యం అమృతం విషం.! ఔను, కూటమి హయాంలో కూడా దాదాపు ఏడాదిపాటు అమరావతి పనులు ముందుకు కదల్లేదు. దానికి కారణాలు అనేకం.
కాలం చాలా విలువైనది. రానున్న నాలుగేళ్ళలో అమరావతి పునర్నిర్మాణం పూర్తవుతుందా.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్. రాజకీయ సమీకరణాలు మారి, వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి పరిస్థితేంటి.?
Also Read: Touch Me Not Review: సమీక్ష.. బిగుసుకుపోయి, ఓవరాక్షన్ చేసేసి.!
ఇలా సవాలక్ష ప్రశ్నలు. రాత్రికి రాత్రి రాజధాని అమరావతి నిర్మాణం సాధ్యం కాదు. కానీ, గడచిన ఐదేళ్ళ నిర్లక్ష్యం నేపథ్యంలో, అమరావతి అభివృద్ధి అనేది.. రాత్రికి రాత్రి.. అన్నట్లే, శరవేగంగా జరగాలి.
ఒక్కటి మాత్రం నిజం.. వైసీపీ ఉన్మాదం నుంచి అమరావతి బతికి బట్టకట్టడం అనేది అద్భుతం.!