NTR Statue In Amaravati.. మహనీయుల విగ్రహాల వెనుక రాజకీయ కోణమేంటి.? విగ్రహాలు పెడితే, ఓట్లు పడతాయా.? అసలెందుకు విగ్రహాలు పెట్టాలి.?
నిత్యం వార్తల్లో చూస్తుంటాం.. ఫలానా ప్రముఖుడి విగ్రహానికి చెప్పుల దండ.. ఫలానా ప్రముఖుడి విగ్రహ ధ్వంసం.. అంటూ.!
విగ్రహాలెందుకు.? అంటే, వివాదాల కోసమే.. అన్నట్లు తయారైంది పరిస్థితి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలుంటాయ్. ప్రముఖుల విగ్రహాలు కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు.
NTR Statue In Amaravati.. రోడ్డు ప్రమాదాలకీ ఈ విగ్రహాలే కారణం..
రోడ్లకు అడ్డంగా వుండే విగ్రహాల వల్ల జరిగే ప్రమాదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.! విగ్రహాలు పెట్టేది, జనాల ప్రాణాలు తీయడానికా.? అన్న ప్రశ్న వస్తుంటుంది ఇందుకే.
భారీ విగ్రహాల ఏర్పాటు ట్రెండ్ నడుస్తోందిప్పుడు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం దేశంలోనే, అత్యంత ఎత్తయినది.
అలానే, తెలుగు రాష్ట్రాల్లో భారీ అంబేద్కర్ విగ్రహాల్ని ఏర్పాటు చేశారు కొన్నాళ్ళ క్రితం. అంబేద్కర్ భారీ విగ్రహాలు, ఓట్లను రాల్చాయా.? అంటే, లేదు కదా.?
ఎవడబ్బ సొమ్మనీ..
మరెందుకు విగ్రహాల్ని రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తుంటాయ్.? అదీ, ప్రజా ధనంతో.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.
దళితోద్దారకులం.. అని చెప్పుకోవడానికే అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు.. అన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్. ఇప్పుడేమో, ఎన్టీయార్ విగ్రహమట.!
ఈ విగ్రహాల పిచ్చి.. రాను రాను ముదిరి పాకాన పడుతోంది. ప్రజాధనంతో విగ్రహాలు ఏర్పాటు చేయడమేంటి.? ఆ ఖర్చుతో, స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు నిర్మించొచ్చు కదా.?
Also Read: కూలీలు కాదు, శ్రామికులు.! పవన్ కళ్యాణ్ పెద్ద మనసు.!
నవ్విపోదురుగాక.. వాళ్ళకేటి సిగ్గు.? ఒకర్ని చూసి ఇంకొకరు.. వెరసి, అందరూ కలిసి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు.!
చివరగా: ప్రజాధనంతో కాకుండా, ఆయా రాజకీయ పార్టీలు.. తమ సొంత ఖర్చులతో ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుంటే, ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ వుండవు.
లేదూ, అధికారంలో వున్నాం కాబట్టి.. అధికార దుర్వినియోగం చేస్తాం.. మా కుటుంబ సభ్యుల విగ్రహాలు.. మాకు నచ్చినవారి విగ్రహాలు పెడతాం అంటే.. మీ ఖర్మ.!