India Pakistan War Drill.. భారత్ – పాక్ మధ్య యుద్ధం జరగబోతోందా.? రేపు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘యుద్ధ సన్నద్ధత’కి కేంద్రం ఎందుకు పిలుపునిచ్చింది.?
అసలు, యుద్ధం వస్తే ఏం జరుగుతుంది.? ప్రజలెలా స్పందించాలి.? విద్యార్థులు, యువత ఎలా వ్యవహరించాలి.? రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీస్ వ్యవస్థ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?
నిజానికి, యుద్ధమంటే ఆషా మాషీ వ్యవహారం కాదు. అలాగని, భారత దేశానికి యుద్ధాలూ కొత్త కాదు. పాకిస్తాన్‌తో నిత్య యుద్ధం చేస్తూనే వున్నాం. గతంలో చేశాం, భవిష్యత్తులోనూ చేయబోతున్నాం.
India Pakistan War Drill.. చైనాతో ముప్పు..
పాకిస్తాన్‌తో యుద్ధం భారత దేశానికి పెద్ద కష్టమేమీ కాదు. కానీ, పాకిస్తాన్ వెనకాల వుండి, భారత దేశాన్ని దొంగ దెబ్బ తీయాలనుకునే చైనాతోనే మనకి ముప్పు పొంచి వుంది.
అందుకే, యుద్ధం విషయంలో భారత దేశం ఎప్పుడూ ఆచి తూచి వ్యవహరిస్తూనే వుంటుంది.

రక్షణ రంగానికి కేటాయింపులు, అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడం ఇవన్నీ పాక్ – చైనా.. ఈ రెండు దేశాల్ని దృష్టిలో పెట్టుకునే చేస్తుంటాం.
పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత, భారత్ – పాక్ మధ్య యుద్ధ వాతావరణమేర్పడింది. యుద్ధ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే, యుద్ధ సన్నద్ధతకి కేంద్రం, రాష్ట్రాలకు పిలుపునిచ్చింది.
యుద్ధ సన్నద్ధత.. అందుకే.!
మరీ అంతలా భయపడాల్సిందేమీ లేదు. కాకపోతే, దేశ పౌరులంతా తమ బాధ్యతగా, జరగబోయే యుద్ధ సన్నద్ధతకి సహకరించాలి.
పోలీసులు, సైన్యం, ఎన్‌సీసీ.. వీటికి ప్రజల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందాల్సి వుంటుంది. ఆయా విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేసే సూచనలకు అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలి.

సైనిక వాహనాలు, యుద్ధ సామాగ్రి.. వెళుతున్నప్పుడు, వాటికి దారి ఇవ్వడమే కాదు, వాటిని ఫొటోలు తీయకుండా వుండాలి.. సామాజిక మాధ్యమాల్లో ఆయా వివరాలు పోస్ట్ చేయకుండా వుండాలి.
ఈ మొత్తం వ్యవహారంలో మీడియా కూడా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వుంది.

ఇది కేవలం సన్నద్ధత మాత్రమే. పూర్తి స్థాయి యుద్ధం.. దాదాపుగా జరగకపోవచ్చు. హైవేల మీద యుద్ధ విమానాలు దిగేందుకు ఏర్పాట్లు చాలాకాలంగా జరుగుతున్నవే.
Also Read: Shubman Gill.. ‘గిల్లే’శాడు.. చాలా గట్టిగా.!
అలా చూస్తే, యుద్ధ సన్నద్ధత విషయమై ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఆకాశంలో ఎయిర్ ఫోర్స్, సముద్రంలో నేవీ, భూభాగంపై మిలిటరీ.. భారతదేశాన్ని పహారా కాస్తున్నాయ్.