Table of Contents
Women Devotees Hair Offerings.. దేవుళ్ళకు మొక్కే మొక్కుల విషయమై ఎవరి ఇష్టం వాళ్ళది.! కొందరు, హుండీలో డబ్బులు వేస్తారు, కొందరు బంగారాన్ని వేస్తారు.!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ‘నిలువు దోపిడీ’ ఇచ్చే భక్తులూ వుంటారు. వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాల్ని సమర్పించే, గొప్ప గొప్ప భక్తులూ వున్నారు.
ఇక, తిరుపతి అనగానే, ‘గుండు’ గుర్తుకొస్తుంటుంది. కష్ట కాలంలో తమను వెంకన్నే ఆదుకుంటాడనే నమ్మకంతో, తల నీలాల్ని సమర్పిస్తుంటారు భక్తులు.
భక్తుల్లో ఆడ, మగ.. తేడా ఏంటి.?
ఇక్కడ భక్తులు అంటే, మగ భక్తులే కాదు.. మహిళా భక్తులు కూడా. వయసుతో సంబంధం లేకుండా, తలనీలాల్ని సమర్పించడం తెలిసిన విషయమే.
పుట్టు వెంట్రుకలు దగ్గర్నుంచి, కాటికి కాలు చాపుకుని వున్న వృద్ధులు కూడా వెంకన్నకి తలనీలాలు అర్పించడం చూస్తూనే వున్నాం.

తిరుమలలోని కళ్యాణకట్టకి వెళ్ళి చూస్తే, అర్థమవుతుంది.. తలనీలాలు ఎవరైనా ఇవ్వొచ్చని. కానీ, మహిళలు తల నీలాలు ఇవ్వకూడదంటూ ఓ రచ్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
అప్పుడెప్పుడో ఓ పండితుడు, మహిళలు తల నీలాలు ఇవ్వకూడదు.. అని సెలవిచ్చాడు. ఇలాంటి మేతావులు చాలామందే కనిపిస్తారు. అది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు.. అని వార్తల్లోకెక్కుతుంటారు.
Women Devotees Hair Offerings.. అన్నా కొణిదెల తల నీలాలు సమర్పించడంపై..
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల, ఇటీవల తన కుమారుడు అగ్ని ప్రమాదానికి గురై, కోలుకోవడంతో, తిరుమలకు వెళ్ళి తలనీలాలు సమర్పించారు.

అంతే కాదు, 17 లక్షల రూపాయల విరాళమిచ్చారు కుమారుడి పేరుతో తిరుమల అన్న ప్రసాదానికి. ఆమె స్వయంగా వడ్డించారు భక్తులకి.. ఆ భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
రష్యాకి చెందిన అన్నా లెజినెవా, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. అదే సమయంలో, హిందూ ధర్మాన్ని కూడా పాటిస్తున్నారామె. అదే విషయం, తిరుమలలో ఆమె తలనీలాలు సమర్పించడంతో మరింత స్పష్టమైంది.
మేతావుల రచ్చ..
అంతే, మహిళ అయి వుండీ ఎలా తల నీలాలు సమర్పిస్తారంటూ కొందరు మేతావులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించేస్తున్నారు.
Also Read: లీకు.! సచ్చిపోమాకు.! ‘ఆమె’ కూడా ‘అమ్మ’లాంటిదే.!
అన్నా కొణిదెల, అన్న ప్రసాదం వడ్డిస్తున్నప్పుడు అక్కడ చాలామంది మహిళలు ‘గుండు’తో కనిపించారు. వాళ్ళంతా ఆ దేవదేవుడికి తలనీలాలు సమర్పించినవారే.

తల నీలాల సమర్పణ విషయమై మహిళలు వేరు, పురుషులు వేరు.. అన్న చర్చే రాదు. కష్టమొచ్చినా, మంచి జరిగినా.. వెంకన్న దయ.. అని నమ్మేవారికి, తలనీలాలు సమర్పించుకోవడం అనేది భక్తి పూర్వకమైన బాధ్యత.