Kayadu Lohar Lucky Beauty.. ఏ రంగంలోనైనా ఎవరి దశ ఎప్పుడు, ఎలా తిరుగుతుందో చెప్పలేం.!
సినీ పరిశ్రమ విషయానికొస్తే, చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు.. అన్నీ వుండి దశ బాగుండకపోతే.. రేస్‌లో వెనకబడిపోవడమే. దశ బాగుంటే దిశ బాగుంటుందంటారుగా.! అలా దశే బాగుంటే టాలెంట్‌తో కూడా పని లేదు.
అసలు విషయమేంటంటే, అప్పుడెప్పుడో శ్రీ విష్ణు నటించిన సినిమా ‘అల్లూరి’లో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుండే వుంటుంది. బహుశా గుర్తు లేకపోనూ వచ్చు. పేరు కయాదు లోహర్.
ఆ అమ్మడి దశ ఇప్పుడు తిరిగినట్లుంది. ‘అల్లూరి’ తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో నటించింది లేదీ అమ్మడు. కొన్ని తమిళ, కన్నడ సినిమాల్లో మాత్రం నటించింది.
Kayadu Lohar Lucky Beauty.. నానితో సినిమా అంటే లక్కు తోక తొక్కినట్లేగా.!
ఇప్పుడు టాలీవుడ్‌లో పాప దశ తిరిగిపోయినట్లే అనిపిస్తుంది. నేచురల్ స్టార్ నాని సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందన్న ప్రచారంతో.
నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఓ కొత్త ప్రాజెక్ట్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

ఇటీవలే ఈ సినిమాకి ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ వదిలిన టీజర్ గ్లింప్స్ కూడా బోలెడంత రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలోనే నానికి జోడీగా కయాదూ లోహర్ నటిస్తోందని ప్రచారం జరుగుతోంది.
అసలే నాని ఈ మధ్య హిట్లు మీద హిట్లు కొడుతూ ఓ రేంజ్‌లో దూసుకెళ్లిపోతున్నాడు. అలాంటి నాని సినిమాలో హీరోయిన్ అంటే ఇంకేముంది.! టాలీవుడ్‌కి సుపరిచితురాలైపోయినట్లే ఈ ముద్దుగుమ్మ.
కొంచెం బొద్దుగా వున్నా.. బోలెడంత టాలెంటమ్మా.!
ఇక, కయాదు లోహర్ విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో ఓ మోస్తరు యాక్టివ్‌గా వుండే ఈ అందాల భామ, అటు తమిళంలో సీనియర్ హీరో శింబుతోనూ ఓ సినిమాలో నటిస్తోంది.
Also Read: జయశ్రీ రాయ్.. జగతి.. జ్యోతి పూర్వజ్.! సూపర్ విమెన్!
కన్నడ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన జి.వి. ప్రకాశ్‌తోనూ ఓ సినిమాలో నటిస్తోంది. చూస్తుంటే అటు తమిళ, కన్నడంతో పాటూ, తెలుగులోనూ క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటున్నట్లే కనిపిస్తోంది.

నిజం చెప్పాలంటే, కయాదు లోహర్ మంచి పొటెన్షియల్ వున్న నటి. ఓ కన్నడ సినిమా కోసం యాక్షన్ ఘట్టాల్లోనూ అలవోకగా నటించేసింది.
ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికైనా సిద్ధమే అంటోంది కాయదు లోహార్. ఛాన్సు రావాలే కానీ.!
ఏమో.! జరుగుతున్న ప్రచారం నిజమై నాని సినిమాలో ఛాన్స్ కొట్టినట్లైతే.. నిజంగానే కయాదు లోహర్ దశ తిరిగినట్లే.! చూడాలి మరి.!