Table of Contents
Operation Sindoor Brahmos Missile.. ‘ఆపరేషన్ సిందూర్’లో ‘బ్రహ్మోస్ క్షిపణి’ ప్రయోగం జరిగిందా.? లేదా.?
అసలేంటీ బ్రహ్మోస్ క్షిపణి.? ఈ బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యమెంత.? అది కలిగించే నష్టమెంత.? ఇలా చాలా ప్రశ్నలు సగటు భారతీయుల్లో వ్యక్తమవుతున్నాయి.
రష్యా, భారత్.. సంయుక్తంగా అభివృద్ధి చేసిన క్రూయిజ్ మిస్సైల్ ఇది. ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ‘బ్రహ్మోస్’ క్షిపణి సొంతం.
సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్..
సూపర్ సోనిక్ యుద్ధ విమానాల గురించి తెలుసు కదా.? అలాగే, ఇది సూపర్ సోనిక్ మిస్సైల్ అన్నమాట. బ్రహ్మోస్ ప్రత్యేకతల్లో ఇది కూడా ఒకటి.
అత్యంత ఖచ్చితత్వంతో, సూపర్ సోనిక్ వేగంతో లక్ష్యాల్ని ఛేదించడం బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకత. భూమ్మీద నుంచీ, అలాగే గాల్లోంచీ, అలానే సముద్ర జలాల్లోంచి కూడా బ్రహ్మోస్ క్షిపణిని సంధించే అవకాశం వుంది.
అంటే, యుద్ధ విమానాల ద్వారా ఆకాశం నుంచీ, మొబైల్ లాంఛన్ల ద్వారా భూమ్మీద నుంచీ, యుద్ధ నౌకల ద్వారా సముద్రం నుంచీ, బ్రహ్మోస్ క్సిపణుల్ని ప్రయోగించొచ్చు.
Operation Sindoor Brahmos Missile.. విధ్వంసం వేరే లెవల్..
బ్రహ్మోస్ క్షిపణులు సూపర్ సోనిక్ వేగంతో శతృవుల గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తాయి.. పెను విధ్వంసాన్ని సృష్టించే సత్తా బ్రహ్మోస్ క్షిపణులకు వుంది.
సూపర్ సోనిక్ వేగమే, శతృ రాడార్లకు బ్రహ్మోస్ చిక్కకుండా దూసుకెళ్ళడానికి ముఖ్య కారణం. అందుకే, బ్రహ్మోస్ మరింత ప్రత్యేకమైన క్షిపణిగా గుర్తింపు పొందింది.

ప్రపంచ వ్యాప్తంగా అగ్ర దేశాలనబడే కొన్ని దేశాలకు చెందిన వెరీ వెరీ స్పెషల్ మిస్సైళ్ళతో బ్రహ్మోస్ పోటీ పడగలుగుతుందంటే, బ్రహ్మోస్ స్థాయి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.
ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించారా.? లేదా.?
యుద్ధ సమయంలో ఆయుధాల వినియోగం అత్యంత వ్యూహాత్మకంగా వుంటుంది. ఈ క్రమంలో ఏ ఆయుధాన్ని వాడామన్నది, త్రివిధ దళాలు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా, పాకిస్తాన్ భూభాగంపైకి భారత దేశం అనేక ఆయుధాల్ని సంధించింది. లక్ష్యాల్ని ఆ ఆయుధాలు అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేశాయి.
అందులో బ్రహ్మోస్ కూడా వుందనీ, బ్రహ్మోస్ సృష్టించిన విధ్వంసం తర్వాతే పాపిస్తాన్ దిగొచ్చిందనీ రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ జీతంతో అనాధలకు మెరుగైన జీవితం.!
అయితే, త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు మాత్రం, ఏ ఆయుధాల్ని పాకిస్తాన్ పైకి పంపించి, ఆపరేషన్ సిందూర్‌ని విజయవంతం చేసిందీ అధికారికంగా ఇప్పటిదాకా వెళ్ళడించలేదు.
ఒక్కటి మాత్రం నిజం.. ఇలాంటి సమయాల్లోనే, మన ఆయుధాల శక్తిని ప్రపంచానికి ఘనంగా చాటి చెప్పే అవకాశం దొరుకుతుంటుంది.
శతృవు ఇంకోసారి భారత దేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే, వణుకు పుట్టేలా చేసింది ఆపరేషన్ సిందూర్.! అందులో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించిందన్న ప్రచారం ఇస్తున్న ‘కిక్కు’ అంతా ఇంతా కాదు.