Manchu Manoj Mounika Marriage సినీ నటుడు మంచు మనోజ్ పెళ్ళి చేసుకున్నాడు.
గతంలోనే ఆయనకు ఓ సారి పెళ్ళి కాగా, వైవాహిక బంధంలో ఏర్పడ్డ మనస్పర్ధల కారణంగా మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.
తాజాగా, మంచు మనోజ్ వివాహం మౌనికతో జరిగింది. మౌనిక, రాజకీయ కుటుంబానికి చెందిన వారు. ఆమె దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల ద్వితీయ కుమార్తె.
మౌనిక రెడ్డికి కూడా ఇది ద్వితీయ వివాహమే. ఆమె కూడా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ రోజుల్లో ఇలాంటివి వింతేమీ కాదు.!
Manchu Manoj Mounika Marriage శివుని ఆజ్ఞ.. అనగానేమి.?
సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్ ఓ ఆసక్తికరమైన ఫొటో పోస్ట్ చేశాడు. అది మంచు మనోజ్ – మౌనికల పెళ్ళి ఫొటో. ఇద్దరి చేతులూ కలిశాయి. ఇంకో చెయ్యి కూడా వుంది. అది ఓ చిన్నారి చెయ్యిలా కనిపిస్తోంది.

‘శివుని ఆజ్ఞ’ అని కూడా రాసుకొచ్చాడు ఈ ఫొటో పోస్ట్ చేస్తూ. శివుడి ఆజ్ఞ లేనిదే, చీమైనా కుట్టదంటారు.! బహుశా ఆ ఉద్దేశ్యంతోనే మనోజ్, ‘శివుని ఆజ్ఞ’ అంటూ, తన పెళ్ళి విషయమై ట్వీటేశాడనుకోవాలా.? వేరే కారణం ఏమైనా వుందా.?
శివుని ఆజ్ఞ.. మంచు మనోజ్ రెండో పెళ్ళి.!
ఇంతకీ, ఈ ‘శివుని ఆజ్ఞ’ సంగతేంటి.?
చాలామందికి రకరకాల డౌటానుమానాలొస్తున్నాయ్..
Mudra369
ఇంతకీ, ‘శివుని ఆజ్ఞ’ అంటే ఏంటి.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్‌తో శ్రీలీల ఆన్ స్క్రీన్ రొమాన్స్.!
మరోపక్క, మంచు మనోజ్ వైవాహిక జీవితం అందంగా, ఆనందంగా సాగాలని ఆకాంక్షిస్తూ అభిమానులుు విషెస్ పంపిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.
అత్యంత సన్నిహితుల నడుమ..
అత్యంత సన్నిహితుల్ని మాత్రమే మంచు మనోజ్ – మౌనికల వివాహ వేడుకకు హాజరయ్యారు. పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు.