Bhumi Pednekar On-Screen Chemistry.. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ విషయంలో నటీనటులు చెప్పే మాటలు ఒకింత ఆశ్చర్యకరంగా వుంటాయ్.! అందులో వింతేమీ లేదు కూడా నిజానికి.!
అరవయ్యేళ్ళ హీరో, ఇరవయ్యేళ్ళ హీరోయిన్‌తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండిస్తే, ‘అహో అద్భుతం.. నీ వయసు పాతిక ముప్ఫయ్యేళ్ళు తగ్గిపోయింది..’ అంటూ హీరోల్ని పొగిడేస్తాం.
అదే, వయసు మీద పడిన హీరోయిన్లు, తమకంటే తక్కువ వయసున్న హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండిస్తే మాత్రం.. అది ‘బూతు’ అయిపోతుంటుంది.
Bhumi Pednekar On-Screen Chemistry.. తప్పేముంది.? కెమిస్ట్రీ అదిరిందిగా.!
ఓ వెబ్ సిరీస్ కోసం బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్, తనకంటే వయసులో ఆరేళ్ళ చిన్నవాడైన బాలీవుడ్ హీరో ఇషాన్ కత్తర్‌తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదరగొట్టేసింది.
ఇంకేముంది.. భూమి పెడ్నేకర్ మీద విపరీతమైన ట్రోలింగ్ షురూ అయ్యింది సోషల్ మీడియా వేదికగా. దాంతో, తన మీద జరుగుతున్న ట్రోలింగ్ మీద భూమి పెడ్నేకర్ స్పందించాల్సి వచ్చింది.

‘కథకి అనుగుణంగానే పాత్రల్ని డిజైన్ చేస్తాడు దర్శకుడు.. అది నచ్చితేనే సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా.. దానికి నటీనటులుగా మేం కమిట్ అవుతాం..’ అని చెప్పింది భూమి పెడ్నేకర్.
‘అయినా, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నటీనటులు ఇద్దరూ, పూర్తి అవగాహనతో వుంటేనే, ఇంటిమేట్ సీన్స్ వర్కవుట్ అవుతాయ్’ అని భూమి చెప్పుకొచ్చింది.
Also Read: HIT-3 Review: నాని చెప్పింది సగమే నిజం.!
‘ఆరేళ్ళ వయసు తక్కువున్న ఇషాన్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ విషయంలో నేను ఇబ్బంది పడలేదు. అతని పాత్రలో అతను, నా పాత్రలో నేను పరకాయ ప్రవేశం చేశామంతే’ అన్నది భూమి వెర్షన్.
అంతే కదా మరి.! ఇందులో తప్పేముంది.? అన్నట్టు, సదరు వెబ్ సిరీస్ పేరు రాయల్.!

ఇక, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఇంటిమేట్ సీన్స్, అంగాంగ ప్రదర్శన.. వీటి గురించి మాట్లాడుకోవాలంటే, భూమి పెడ్నేకర్ ఆల్రెడీ వీటిల్లో మాస్టర్ డిగ్రీ చేసేసింది.
‘రాయల్’ వెబ్ సిరీస్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.. అది కూడా భూమి – ఇషాన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వల్లనే.