Table of Contents
Fighter Aircraft India AMCA.. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. యుద్ధ విమానాల తయారీలో భారత దేశం అనుకున్నంత వేగంగా ‘ప్రగతి’ సాధించలేకపోతోంది.!
చైనా, పాకిస్తాన్ దేశాల నుంచి ఒకేసారి ముప్పు ఎదురైతే ఎలా.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత తేలికేమీ కాదు.! ఇది అందరికీ తెలిసిన విషయమే.
నిజానికి, పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సి వస్తే, అదేమంత కష్టమైన విషయం కాదు భారత దేశానికి. కానీ, పాకిస్తాన్‌తో చైనా చేతులు కలిపితే, పరిస్థితి వేరేలా వుంటుంది.
ఇదేదో మన త్రివిధ దళాల స్థాయిని, మన ఆయుధ వ్యవస్థ సత్తానీ తక్కువగా చిత్రీకరించే ప్రయత్నం కానే కాదు.!
Fighter Aircraft India AMCA.. మన తయారీ.. ఎంత ప్రత్యేకం.?
దశాబ్దాలుగా అత్యాధునిక యుద్ధ విమానం తయారీ విషయంలో, భారత దేశం ప్రయత్నాలు చేస్తూనే వుంది. ‘తేజస్’ యుద్ధ విమానమొక్కటే, ‘మన తయారీ’ ప్రస్తుతం.!
సుఖోయ్ యుద్ధ విమానాన్నీ మన దేశంలోనే తయారు చేసుకుంటున్నా, అది రష్మాకి చెందిన యుద్ధ విమానం. అంతకు ముందు ‘మిగ్’ యుద్ధ విమానాల్ని తయారు చేసుకున్నా, అవీ రష్యాకి చెందినవే.
తేజస్ తేలిక పాటి యుద్ధ విమానం. సుఖోయ్‌ని మించిన ‘ఎయిర్ సుపీరియారిటీ యుద్ధ విమానం’ అవసరం భారతదేశానికి వుంది.
తక్షణావసరాల కోణంలో, రఫాలె యుద్ధ విమానాల్ని కొనుక్కోవాల్సి వచ్చింది. ముందు ముందు కూడా ఇలాంటివి కొనుగోలు చేయాల్సి రావొచ్చు.
యుద్ధ విమానాల తయారీలో అతి పెద్ద సమస్య, జెట్ ఇంజిన్స్. కావేరీ ఇంజిన్ గనుక, పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, యుద్ధ విమానాల తయారీ వేగం పుంజుకుంటుంది మన దేశంలో.
ఎఎంసీఏ గేమ్ ఛేంజర్..
కానీ, దశాబ్దాల తరబడి, కావేరీ ఇంజిన్ల తయారీ అంశం సాగుతూ సాగుతూ వస్తోంది. సరికొత్త యుద్ధ విమాన తయారీకి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అదే ‘ఎఎంసీఎ’.
ఐదో తరం యుద్ధ విమానంగా ‘ఎఎంసీఎ’ని అభివర్ణిస్తున్నారు. ఆ విమాన తయారీకి సైతం, కావేరీ ఇంజిన్లు ఉపయోగించే అవకాశం లేకపోలేదు.
ఎయిర్ ఫోర్స్‌తోపాటు, నేవీ అవసరాల కోసం కూడా స్వదేశీ యుద్ధ విమానం అత్యవసరం.
విదేశాల నుంచి కొనుక్కుంటున్న యుద్ధ విమానాలకు తోడు, స్వదేశీ తయారీ యుద్ధ విమానాలు.. మన సైనిక శక్తిని పెంచుతాయి.
Also Read: అంబటి రాయుడి ‘గుడ్డి’ సిద్ధాంతం.!
అందుకే, కొనుక్కోవడం కూడా అవసరమే.. అంతకు మించి, సొంతంగా తయారు చేసుకోవడమూ అత్యవసరం.
సొంతంగా తయారు చేసుకునే యుద్ధ విమానాల్ని, అవసరమైతే ఇతర దేశాలకు విక్రయించడం ద్వారా, దేశానికి ఆర్థికంగానూ మేలు కలుగుతుంది.
అదే అత్యంత కీలకం.!
యుద్ధవిమానంలో, ఆయుధ వ్యవస్థలు అత్యంత కీలకం.! యుద్ధ విమానం తయారీతోపాటు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు, ఇతరత్రా కీలక ఆయుధాలు.. వీటన్నిటిలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి.
యుద్ధ రంగాన, ‘భారత్ తయారీ’ ఆయుధ వ్యవస్థలు ఇప్పటికే, ప్రపంచానికి మన సత్తా ఏంటన్నది నిరూపించేశాయి.
అత్యాధునిక యుద్ధ నౌకలు, అందునా విమాన వాహక యుద్ధ నౌకల్ని తయారు చేయగలమని నిరూపించాం. అణు జలాంతర్గాముల్ని తయారు చేసి, యుద్ధ రంగంలోకి దించాం. చెప్పుకుంటూ పోతే, చాలానే వుంది.