Ambati Rayudu Blind World.. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, సోషల్ మీడియా వేదికగా చెప్పిన ఓ నీతి వాక్యం.. వివాదాస్పదమయ్యింది.
భారత్ – పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నవేళ్ళ, ‘కన్నుకు కన్ను.. అంటే, ప్రపంచం గుడ్డిదైపోతుంది’ అంటూ ట్వీటేశాడు అంబటి రాయుడు.
దాంతో, సహజంగానే నెటిజన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకతను అంబటి రాయుడు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఎందుకంటే, భారతదేశంలో అంతటి భావోద్వేగ పరిస్థితులు వున్నాయి మరి.
Ambati Rayudu Blind World.. కంటికి కన్ను..
మనం మామూలుగానే వాడేస్తుంటాం, కంటికి కన్ను.. కాలుకు కాలు.. చెయ్యికి చెయ్యి.. అని.! మనకి హాని తలపట్టేవారికి, అదే శాస్తి చేయాలన్నది ఈ ప్రస్తావన తాలూకు ఉద్దేశ్యం.
పహల్గామ్ టెర్రర్ ఎటాక్‌లో, దాదాపు ముప్ఫయ్ మంది అమాయక భారతీయులు, అందునా హిందువులైన ‘భర్తలు’ ప్రాణాలు కోల్పోయారు.. వారి భార్యల యెదుట. అదీ, వారి పిల్లలు చూస్తుండగా.
‘వెళ్ళి మీ మోడీకి చెప్పుకో..’ అంటూ, తీవ్రవాదులు.. మహిళల భర్తల్ని చంపేసి, ఆ మహిళలతో నిర్లజ్జగా మాట్లాడిన దారుణమైన పరిస్థితి పహల్గామ్ టెర్రర్ ఎటాక్‌లో కనిపించింది.
ఈ క్రమంలో, భారత త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి.. తీవ్రవాదుల్ని ఏరిపారేసే ఆపరేషన్ ప్రారంభించాయి. అదే ‘ఆపరేషన్ సిందూర్’.
యుద్ధ మేఘాలు..
‘ఆపరేషన్ సిందూర్’ కాస్తా, భారత్ – పాక్ మధ్య యుద్ధంగా మారింది. ఓ భారతీయుడిగా, పహల్గామ్ ఘటన నేపథ్యంలో, బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపి వుండాలి అంబటి రాయుడు.
త్రివిధ దళాలు ఏ నిర్ణయం తీసుకున్నా, ‘మేము సైతం’ అనాల్సి వుంది అంబటి రాయుడు.. బోల్డంత పాపులారిటీ వున్న ఓ మాజీ క్రికెటర్ అయి వుండీ, ‘గుడ్డి సిద్ధాంతం’ తెరపైకి తేవడమేంటి.?
Also Read: హీరోకైనా, హీరోయిన్‌కైనా ఒకటే పేమెంట్: నిర్మాత సమంత
అదే, నీ ఇంట్లో పహల్గామ్ టెర్రర్ ఎటాక్ బాధితులుంటే ఇలానే మాట్లాడతావా.? అని నెటిజనం ఏకిపారేస్తున్నారు.
ఒక్క ట్వీట్, అంబటి రాయుడు స్థాయిని పాతాళానికి పడేసింది. కాదు కాదు, తన స్థాయిని తానే పాతాళానికి తొక్కేసుకున్నాడు అంబటి రాయుడు.
ఓ గుడ్డి ప్రపంచంలో అంబటి రాయుడు బతికేస్తున్నాడన్న విషయం చాలామందికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.
లక్షల కోట్ల బడ్జెట్.. ప్రాణాలకు తెగించి దేశానికి రక్షణగా నిలుస్తున్న లక్షలాది మంది సైన్యం.. ఇదంతా దేనికోసం.? అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది అంబటి రాయుడికి.