Niharika Konidela Glamorous Producer.. నిహారిక కొణిదెల.. కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కదా.! ఎందుకంటే, నిహారిక అంటే మెగా ప్రిన్సెస్.
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక, తొలుత బుల్లితెరపైకొచ్చింది.. ఆ తర్వాత వెండితెరపై సందడి చేసింది.
కానీ, నటిగా వెండితెరపై సక్సెస్ అవలేకపోయింది నిహారిక. అడపా దడపా నటిగా సినిమాలు చేస్తున్నా, నిర్మాణం వైపే ఆమె ఈ మధ్య ఎక్కువ ఫోకస్ పెడుతోంది.
ఆ మధ్య నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. ఇంకో సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది కూడా.
Niharika Konidela Glamorous Producer.. గ్లామరు.. ట్రోలింగు..
నిర్మాతకెందుకు గ్లామర్.? అవసరమా.? అంటూ, నిర్మాత నిహారిక కొణిదెలపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతోంది.
ఎప్పటికప్పుడు జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫొటోలే కాదు, అల్ట్రా మోడ్రన్ లుక్‌లో ఫొటో సెషన్లు చేయించుకుని, ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడుతూ వస్తోంది నిహారిక.
ట్రోలింగ్ సంగతే పట్టించుకోవట్లేదు నిహారిక.. దాంతో, ఆమెను మరింతగా కొందరు టార్గెట్ చేసి, దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు.

నిజానికి, నిహారికకి ఈ ట్రోలింగ్ కొత్తేమీ కాదు. వివాహం, విడాకుల నేపథ్యంలో నిహారిక బోల్డంత ట్రోలింగ్ ఎదుర్కొంది.. నిలదొక్కుకుంది కూడా.
ఆ మధ్య నిహారిక ఓ వెబ్ సిరీస్‌లో నటించడం కూడా ‘ట్రోలింగ్’కి ఆస్కారమిచ్చిందనుకోండి.. అది వేరే సంగతి.
సినిమా అంటేనే గ్లామర్..
మోడ్రన్ డ్రస్సుల్లో కనిపిస్తే తప్పేముంది.? అందంగా కనిపించాలనుకోవడం తప్పెలా అవుతుంది.? వల్గారిటీ అయితే ఏమీ లేదు కదా.? అంటూ, నిహారికపై నడుస్తున్న ట్రోలింగ్‌ని కొందరు తప్పు పడుతున్నారు.
ఏదేమైతేనేం, ఈ ట్రోలింగ్ కూడా నిహారికని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మార్చుతోందనుకోండి.. అది వేరే సంగతి.
Also Read: ‘రంగీలా’ ఊర్మిళ.. వయసు యాభై ప్లస్సూ.!
నిర్మాణంలో దూకుడు ప్రదర్శిస్తున్నా, నటనపై తన ఇంట్రెస్ట్ ఏమాత్రం తగ్గలేదన్నది నిహారిక కొణిదెల వాదన.
అంజనా ప్రొడక్షన్స్ పేరుతో తన తండ్రి నాగబాబు నిర్మాతగా సొంత నిర్మాణ సంస్థ వున్నాగానీ, తనకంటూ ఓ సొంత బ్యానర్ పెట్టుకుని, ఆ బ్యానర్ మీదనే సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తోంది నిహారిక.