Urmila Matondkar Rangeela.. భారతీయ సినీ పరిశ్రమలో ‘రంగీలా’ సినిమాకి ఓ ప్రత్యేకమైన పేజీ వుంటుందేమో.! ఆ స్థాయి కమర్షియల్ విజయాన్ని అందుకుంది ఆ సినిమా.
‘రంగీలా’ సినిమాకి రామ్ గోపాల్ వర్మ దర్శకుడు.. ఊర్మిళ హీరోయిన్. ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్.. ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
తెలుగులోనూ ఊర్మిళ మతోంద్కర్ కొన్ని సినిమాలు చేసింది. అందులోనూ ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలే.
నిజానికి, రంగీలా అంటే ఊర్మిళ.. ఊర్మిళ అంటే రంగీలా. ఆ స్థాయిలో రంగీలా సినిమాతో ఊర్మిళ మతోంద్కర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయిందనడం అతిశయోక్తి కాదు.
Urmila Matondkar Rangeela.. రాజకీయాల్లోకి వెళ్ళి..
ఊర్మిళ సినీ రంగంలో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకుంది.. అలానే డిజాస్టర్లు కూడా చవిచూసిందనుకోండి.. అది వేరే సంగతి.
సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్ళింది ఊర్మిళ. కాంగ్రెస్ పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయింది ఊర్మిళ. ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారామె.

కాంగ్రెస్ నుంచి పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసిన ఊర్మిళ, ఓడిపోయాక, శివసేన పార్టీలో చేరింది. కానీ, రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేదిప్పుడు.
ప్రస్తుతం ఊర్మిళ వయసు యాభై ప్లస్.! రాజకీయాలు అంతగా కలిసి రాకపోవడంతో, తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటోంది.
గ్లామర్.. అస్సలు తగ్గేదే లే..
చూస్తున్నారు కదా.. వయసు మీద పడినా వన్నె తగ్గని అందం.. అనిపించుకోవాలనో ఏమో.. ఇదిగో, ఇలా హాట్ హాట్ పొటో సెషన్లతో చెలరేగిపోతోంది ఊర్మిళ.
Also Read: అందం పిచ్చి.. ఆమెను ‘అంతం’ చేసిందా.?
గ్లామర్ ప్రదర్శనకి వయసు అడ్డంకి కాదని.. చెప్పాలనుకుందో ఏమో.! అయినా, యాభై ఏళ్ళ వయసులో ఈ పైత్యమేంటి.? అన్న విమర్శలు మామూలేననుకోండి.. అది వేరే సంగతి.
అయినా, అదీ తప్పు కాదు.. ఒకప్పటి హీరోయిన్లు, ఇప్పటికీ.. గ్లామర్‌తో తెరపై చెలరేగిపోతూనే వున్నారు. ఊర్మిళ కూడా అందుకు మినహాయింపు కాకపోవచ్చు.