Rashmika Mandanna RRR Trendy.. లుక్కు అదిరింది కదా.! కాదు.. కాదు.. భయపెడుతోంది కదా.! అబ్బే, భయపెట్టడంలేదు.. సమ్‌థింగ్ ట్రెండీ అన్నమాట.!
నేషనల్ క్రష్ రష్మిక మండన్న, ఓ మ్యాగజైన్ కవర్ కోసం, ఇదిగో ఇలా రెట్రో లుక్‌లో సందడి చేసింది.
డర్టీ కట్ 25.. అంటూ, రష్మిక మండన్నతో ఇదిగో, ఇలా భయపెట్టారు సదరు మ్యాగజైన్ నిర్వాహకులు.
కన్నడ కస్తూరి రష్మిక మండన్న అంటే, ఇప్పుడు నేషనల్ క్రష్. కన్నడ, తమిళ, తెలుగు, హిందీ సినీ పరిశ్రమల్లో రష్మిక మండన్నకి వున్న ఫేమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!
ఫొటో సెషన్లు.. అంటే, చెలరేగిపోతుందంతే..
రష్మిక మండన్న, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్.!
ఫొటో సెషన్ల విషయంలో రష్మిక మండన్న నిజంగానే సమ్ థింగ్ వెరీ స్పెషల్.! డిఫరెంట్ స్టైలింగ్‌తో ఫొటో సెషన్లకు పోజులిస్తుంటుంది.
కొన్ని ఫొటోలు ట్రోల్ అయినా.. కొన్ని ఎక్స్ప్రెషన్లు.. ఆమెను ట్రోలింగ్కి గురిచేసినా.. తగ్గేదే లే.. అంటుందామె. ఆ రకంగా ముందుకు దూసుకుపోతోంది ఈ కన్నడ కస్తూరి.
Rashmika Mandanna RRR Trendy.. రెడ్ లిప్స్.. లుక్స్ అదుర్స్..
డర్టీ కట్.. ఫొటో సెషన్ సందర్భంగా, రెడ్ లిప్స్‌తో రష్మిక లుక్ నిజంగానే స్టన్నింగ్. చేతికి పూర్తి స్థాయి గ్లవ్స్ లాంటి ‘కవరింగ్’.. అంతకు మించి, రష్మిక ఎక్స్ప్రెషన్.. ఈ ఫొటోని వెరీ వెరీ స్పెషల్‌గా మార్చేసింది.
ఆ హెయిర్‌ని రెట్రో థీమ్‌తో డిజైన్ చేసిన వైనం.. పరస్పరం కాంట్రాస్ట్‌గా వుండేలా, బ్రైట్ కలర్స్‌తో మొత్తం ఫొటోని తీర్చిదిద్దిన కాన్సెప్ట్.. సింప్లీ సూపర్బ్ అంతే.
Also Read: సమీక్ష: శ్రీవిష్ణు ‘సింగిల్’.. దీన్ని ‘హాస్యం’ అనగలమా.?
ఫ్యాషన్ ట్రెండ్స్‌ని తనకు తాను అన్వయించుకోవడంలో రష్మిక ఎప్పటికప్పుడు ముందుంటుందనడానికి ఈ ఫొటో ఓ నిదర్శనం.
ఏమాటకామాటే చెప్పాలంటే, ఈ తరం అమ్మాయిలకి రష్మిక ఓ రోల్ మోడల్, ట్రెండ్ సెట్టర్. చాలామంది అమ్మాయిలు, రష్మికని పెర్ఫెక్ట్గా ఫాలో అయిపోతుంటారు.. స్టైలింగ్ విషయంలో.