Table of Contents
Sree Vishnu Single Review.. హీరో శ్రీవిష్ణు, మాటల్ని మింగేస్తున్నాడు ఈ మధ్య.! బానే వర్కవుట్ అవుతోందిగా.. అనేస్తున్నాడు, అలా ‘మింగేయడం’ గురించి.!
అలానే, తన మాటల్లో బూతులు కూడా ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. ఆడియన్స్, సర్దుకుపోతున్నార్లే.. అన్నది బహుశా శ్రీవిష్ణు వాదన కావొచ్చు.
శ్రీవిష్ణు హీరోగా కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన సినిమా ‘సింగిల్’. ప్రమోషన్లు గట్టిగా నడిచాయి. ‘మంచు కురిసిపోవడం’ లాంటి, డబుల్ మీనింగ్ డైలాగులు ప్రోమోస్‌తో వైరల్ అయ్యాయి.
Sree Vishnu Single Review.. మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేయడంతో..
అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు గుస్సా అవడంతో, ‘సింగిల్’ నుంచి కొన్ని డైలాగుల్ని తొలగించారు.. శ్రీవిష్ణు క్షమాపణ కూడా చెప్పాడు.
సినిమా విడుదలయ్యాక, బానే వుంది.. బాలేదు.. హిట్టు.. ఫట్టు.. ఇలా చాలా మాటలు వినిపించాయి.

ఓటీటీలో వచ్చాక చూద్దాంలే.. అనుుకుని, థియేటర్‌లో సినిమా చూసే ఆలోచనని పక్కన పెట్టేయాల్సి వచ్చింది.
ఓటీటీలో ‘సింగిల్’ వచ్చింది. కాస్త తీరిక చూసుకుని, సినిమా చూడటమూ జరిగింది. స్క్రీన్ మీద కంటిన్యూస్‌గా దృష్టిపెట్టాలనిపించలేదంటే, దానర్థం సినిమా బాలేదని.
కథేంటంటే..
ఓ హీరో, ఇద్దరు హీరోయిన్లు.. హీరో ఒక హీరోయిన్‌ని ప్రేమిస్తాడు. ఇంకో హీరోయిన్, హీరోని ప్రేమిస్తుంది. అంటే, ముక్కోణపు ప్రేమ కథ అన్నమాట.
హీరోయిన్‌ని పడేయడానికి హీరో ఎన్ని వేషాలు వేస్తాడో, అవే వేషాలు ఇంకో హీరోయిన్, హీరోని తన ప్రేమలో పడేయడానికి వేస్తుంటుంది.
చివరికి హీరో, ఏ హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు.? ఎవర్ని పెళ్ళాడతాడు.? ఇద్దరిలో ఒకరైనా దక్కుతారా.? ఇద్దరూ చేజారిపోతారా.? అదంతా తెరపై చూడాల్సిన కథ.
కొన్ని నవ్వులు.. బోల్డంత సోది
అక్కడక్కడా కొన్ని నవ్వులు ఓకే. వెన్నెల కిషోర్ – శ్రీవిష్ణు మధ్య కెమిస్ట్రీ.. ఇంకా బాగా వర్కవుట్ అయ్యే అవకాశం వున్నా, సోదికే పరిమితం చేశారు.
ఇవానా యాక్టివ్‌గా కనిపించింది.. కేతిక శర్మ జస్ట్ ఓకే.! పిచ్చి కామెడీ.. ఆపై, కొంత సెంటిమెంట్.. ఇంతే ‘సింగిల్’ గురించి చెప్పుకోవడానికి.
ఇంతకు ముందు ఏదో సినిమాలో చూసినట్లుందే.. అనిపించిన సన్నివేశాలు బోలెడు. అవకాశం వున్నా, సన్నివేశాల్ని సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోయారు.
Sree Vishnu Single Review.. డైలాగులు మింగేయడమేంటో..
డైలాగులు కూడా అంతే. రాయడానికీ పెద్దగా కష్టపడలేదు.. చెప్పడానికీ, నటీనటులు ఇష్టపడినట్లు లేదు. అలా తయారైంది పరిస్థితి.
బాలేని సినిమాని ‘బావుంది’ అని ప్రమోట్ చేసుకోవడం వల్ల దర్శక నిర్మాతలకు ఒరిగేదేముంటుదన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. శ్రీవిష్ణునీ సరిగ్గా వాడుకోలేదు, హీరోయిన్ల సంగతీ అంతే. వెన్నెల కిషోర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
థియేటర్లకు ఆడియన్స్ ఎందుకు రావడంలేదంటే, ఆడియన్స్‌ని వెర్రి వెంగళప్పల్లా భావించి, ఇలాంటి ‘సిల్లీ’ సినిమాలు తీస్తుండడం వల్లే.!
ఆ జాగ్రత్తలు తీసుకుని వుంటే..
ముందే చెప్పుకున్నట్లు, ఇదే సినిమాని ఇంకాస్త హెల్తీ హ్యూమర్ జోడించి వుంటే, నిజంగానే పెద్ద హిట్ అయి వుండేది. శ్రీవిష్ణు ఇకపై డైలాగులు మింగేయడం మానేస్తే మంచిది.
మంచి పొటెన్షియాలిటీ వున్న నటుడు శ్రీవిష్ణు. ప్రతిసారీ వెన్నెల కిషోర్ వృధా అవుతూనే వున్నాడంటే, దానర్థం దర్శకులు సరైన పాత్రలు అతని కోసం రాసుకోవడంలేదని.
ఓటీటీలో అయినా సరే, రికమెండ్ చేయదగ్గ సినిమా అయితే కాదిది. పూర్తిగా టైమ్ వేస్ట్.. అని చెప్పేయొచ్చు.