Siddu Jonnalagadda Badass.. సిద్దు జొన్నలగడ్డ.. అదేనండీ, ‘టిల్లు’గాడు.. కొత్త సినిమాతో సందడి చేయబోతున్నాడు. సినిమా టైటిల్ ‘BADASS’.
If Middle Finger Was A Man.. అంటూ, BADASS పోస్టర్‌ని తాజాగా, చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. STAR BOY సిద్దూ అంటే, ఆ మాత్రం వుండాలి మరి.
‘డిజె టిల్లు’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు సిద్దు జొన్నలగడ్డ. దానికి కొనసాగింపుగా వచ్చి, ‘టిల్లు స్క్వేర్’ అంతలా అంచనాలు అందుకోలేకపోయినా, ‘ఓకే’ అనిపించింది.
ఆ తర్వాత వచ్చి, ‘జాక్’ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఈ నేపథ్యంలో, సిద్దూ తదుపరి సినిమాపై ఒకింత అయోమయం సహజమే.
అసలేంటీ BADASS
ఇంతకీ, BADASS అంటే, ఏంటి.? ప్చ్.. అచ్చ తెలుగులోకి దీన్ని అనువదించలేం. పరమ ఛండాలంగా వుంటుంది. కాకపోతే, యూత్‌లో విపరీతంగా వాడే మాట ఇది.
దానికి తోడు, ‘A Middle Finger Was A Man’ అంటున్నారంటే, సినిమా కథ, కథనాలు, డైలాగులు.. ఇవన్నీ ఏ తరహాలో వుంటాయో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
ఫ్యామిలీ ఆడియన్స్, ఈ సినిమాకి దూరంగా వుండాల్సిందేనేమో. సినిమా నిండా బూతులే వుంటాయేమో.. ఇలా రకరకాల అభిప్రాయాలు, BADASS పోస్టర్ విడుదలయ్యాక సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
Siddu Jonnalagadda Badass.. ఏం చేయబోతున్నావ్ సిద్దూ.?
రవికాంత్ పేరపు ఈ చిత్రానికి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ, కథనాల విషయంలోనూ, డైలాగ్స్ విషయంలోనూ, సినిమా నిర్మాణంలోనూ సిద్దూ జొన్నలగడ్డ హస్తం గురించి ప్రత్యేకంగా చెప్పాలా.?
చూద్దాం, ‘జాక్’తో బొక్కబోర్లా పడ్డ ‘టిల్లు’ సిద్దూ జొన్నలగడ్డ, ‘BADASS’తో బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో.! అన్నట్టు, సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.