Balakrishna Disrespects JrNTR.. అసలు బాబాయ్ నందమూరి బాలకృష్ణకీ.. అబ్బాయ్ జూనియర్ నందమూరి తారక రామారావు (ఎన్టీయార్)కీ మధ్య గొడవేంటి.?
చాలాకాలంగా ఈ విషయమై పెద్ద రచ్చే జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీయార్ కొత్త సినిమా ఏది వచ్చినా, బాలయ్య అభిమానులు ఆ సినిమా మీద నెగెటివిటీ ప్రచారం చేయడం చూస్తూనే వున్నాం.
‘జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తే.?’ అన్న ప్రశ్న బాలయ్య ముందుకొచ్చిన ప్రతిసారీ తేలిగ్గా మాట్లాడుంటాడాయన.
Balakrishna Disrespects JrNTR.. జూనియర్ ఎన్టీయార్.. ఆ గౌరవమే వేరు.!
కానీ, జూనియర్ ఎన్టీయార్ ఏనాడూ నందమూరి బాలకృష్ణని తూలనాడింది లేదు. బాబాయ్ బాలయ్య మీద అమితమైన గౌరవం ప్రదర్శిస్తుంటాడు యంగ్ టైగర్.
బాబాయ్.. అబ్బాయ్.. మధ్య అసలు గొడవేంటో.!
లేని గొడవని కొందరు అభిమానులే క్రియేట్ చేస్తున్నారా.?
బాలయ్యపై ట్రోలింగ్ చేస్తున్న జూనియర్ ఎన్టీయార్ అభిమానులెవరు.?
జూనియర్ ఎన్టీయార్ మీద ట్రోలింగ్ చేస్తున్న బాలయ్య అభిమానులెవరు.?
నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీయార్ ఒంటరి అయ్యాడా.?
ఎందుకీ చర్చ.? అసలెందుకీ రచ్చ.? దీనికి ఆస్కారమిస్తున్నదెవరు.?
Mudra369
ఏమయ్యిందోగానీ, నందమూరి తారక రత్న దశ దిన కర్మ సందర్భంగా, బాలకృష్ణ ఒకింత లైట్ తీసుకున్నాడు జూనియర్ ఎన్టీయార్‌ని. కళ్యాణ్ రామ్‌ని సైతం బాలయ్య లైట్ తీసుకోవడం గమనార్హం.
మరో సందర్భంలో కళ్యాణ్‌రామ్‌ని పట్టించుకున్న బాలయ్య, ఆ వెనకే వున్న జూనియర్ ఎన్టీయార్‌ని అస్సలు పట్టించుకోలేదు.

ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య వస్తున్నాడని కూర్చున్న కుర్చీల్లోంచి లేచి నిల్చున్నారు జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్‌రామ్.
కానీ, బాలకృష్ణ వాళ్ళని జస్ట్ అలా చూసి లైట్ తీసుకున్నారు. ఇంకెవరో మాట్లాడుతోంటే, వాళ్ళతో మాట్లాడేసి వెనక్కి వెళ్ళిపోయాడు బాలయ్య.
బాలయ్య నిజంగానే అవమానించాడా.?
ఆ కార్యక్రమంలో బాలకృష్ణ – జూనియర్ ఎన్టీయార్ కలిసి మాట్లాడుకున్నారన్నది ఓ వెర్షన్. అసలు మాట్లాడుకోనే లేదన్నది ఇంకో వెర్షన్. నిజమేంటన్నది ఆ ఇద్దరికే తెలుసు.
Also Read: వెన్నుపోటు: అభిమానులే ఎన్టీయార్‌ని బజారుకీడ్చేశారు.!
కానీ, ఈలోగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని అవమానించిన బాలయ్య.. అంటూ జూనియర్ ఎన్టీయార్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గుస్సా అవుతున్నారు.