Harish Pawan Ustaad Bhagat Singh.. అప్పుడెప్పుడో ప్రారంభమైన సినిమా, అస్సలు ముందుకు కదల్లేదు చాలా నెలలపాటు. నెలలు కాదు, సంవత్సరాలపాటు ఆగిపోయింది.!
గ్యాప్ వస్తేనేం, ఈసారి పక్కాగా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం బల్క్ డేట్స్ ఇచ్చేశారు. దాంతో, హరీష్ శంకర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్.
2024 ఎన్నికల తర్వాత, ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రావడంతో ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో అధికారిక బాధ్యతల నిర్వహణలో బిజీ అయిపోయారు.
దాదాపు ఏడాది తర్వాత, పవన్ కళ్యాణ్, వరుసగా తాను గతంలో ఒప్పుకున్న సినిమాలకి డేట్లు కేటాయించడం షురూ చేశారు.
Harish Pawan Ustaad Bhagat Singh.. చక చకా పూర్తి చేసేస్తున్న పవన్ కళ్యాణ్..
ఈ క్రమంలోనే ‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం పూర్తయ్యింది. సినిమా విడుదలకు సిద్ధమయ్యింది కూడా.
ఇదే జోరులో, ‘ఓజీ’ సినిమా షూటింగ్‌ని కూడా పూర్తి చేసేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ వెంటనే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్‌లోకి పవన్ కళ్యాణ్ అడుగు పెట్టేశారు.
ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు హరీష్ శంకర్, కొత్త ఉత్సాహంతో, సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా వున్నాడు.

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో చాన్నాళ్ళ క్రితం వచ్చిన ‘గబ్బర్ సింగ్’ అప్పట్లో సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
ఈసారి అంతకు మించిన విజయాన్ని హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ నుంచి, అభిమానులు ఆశిస్తున్నారు. నిజానికి, ఆ అభిమానుల్లో హరీష్ శంకర్ కూడా ఒకడు.
పవన్ కళ్యాణ్ అభిమానుల్లో హరీష్ శంకర్ సమ్‌థింగ్ వెరీ స్పెషల్ అంతే. అంత పెద్ద అభిమాని కాబట్టే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆలస్యమవుతున్నా, అదే ‘నమ్మకం’ పవన్ మీద వుంచుతూ వచ్చాడు.
Also Read: సమీక్ష: శ్రీవిష్ణు ‘సింగిల్’.. దీన్ని ‘హాస్యం’ అనగలమా.?
శ్రీలీల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరి నాటికే, సినిమా విడుదలకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయి.
ఈ నెలలోనే ‘హరి హర వీర మల్లు’ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత ‘ఓజీ’, ఆ వెంటనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశముంది.
అభిమానులు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి ఏమేం ఆశిస్తున్నారో, వాటన్నటినీ సమపాళ్ళలో రంగరిస్తున్నాడు హరీష్ శంకర్.