Table of Contents
Pooja Hegde Coolie Monica.. అప్పట్లో జిగేలు రాణి.. ఇప్పుడేమో మోనిక.! పేరు ఏదైతేనేం, ఐటమ్ బాంబులా పేలుతోంది.! ఔను, మేడమ్ సర్.. మేడమ్ అంతే.!
మధ్యలో, ‘ఎఫ్3’ కోసం ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అది కూడా పెద్ద హిట్టు.! పూజా హెగ్దే, ఐటమ్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్ అవుతోందా.?
ఐటమ్ సాంగ్ అనాలా.? స్పెషల్ సాంగ్ అనాలా.? పేరు ఏదైనా పెట్టుకోండి.. పూజా హెగ్దే వాటిల్లో డాన్స్ చేస్తే, ఆ రేంజ్ వేరే లెవల్ అంతే.!
Pooja Hegde Coolie Monica.. రంగస్థలం జిగేలు రాణి..
‘జిగేలు రాణి’ అంటూ ‘రంగస్థలం’ సినిమా కోసం పూజా హెగ్దే చేసిన స్పెషల్ సాంగ్, అప్పట్లో ట్రెండ్ సెట్టర్.. అని చెప్పొచ్చు. ఆ పాటలో డాన్స్‌ని మేగ్జిమమ్ ఎంజాయ్ చేసింది పూజా హెగ్దే.
నిజానికి, పూజా హెగ్దే డాన్సుల్లో జస్ట్ సో..సో.. అంతే.! కానీ, డాన్స్‌ని ఎంజాయ్ చేయడం, ఆ ఎంజాయ్మెంట్.. ఆమె చేసే డాన్సుల్లో కనిపించడమే పూజా హెగ్దే స్పెషాలిటీ.
ఫ్లాపులు మీద ఫ్లాపులు వచ్చినా, పూజా హెగ్దే క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడానికి ఇదీ కూడా ఓ కారణమేమో.! హీరోలతో కలిసి ఎన్నో సినిమాల్లో మంచి మంచి డాన్స్ నెంబర్స్ చేసింది పూజా హెగ్దే.
స్పెషల్ సాంగ్స్ అంటే.. స్పెషల్ మేడమ్.!
‘కూలీ’ సినిమా కోసం తాజాగా ‘మోనిక’ అంటూ స్పెషల్ సాంగ్ చేసింది పూజా హెగ్దే. రజనీకాంత్ నటిస్తున్న సినిమా ఇది.
‘మోనిక’ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎక్కడ విన్నా ఇదే పాట.! బోల్డన్ని రీల్స్ ఈ పాట చుట్టూ చేస్తున్నారు ఔత్సాహిక డాన్సర్లు.
కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసిన స్టెప్పులకి, పూజా హెగ్దే తనదైన గ్లామర్‌ని జోడించడంతో, ‘మోనిక’ పాట వేరే లెవల్‌కి వెళ్ళిపోయింది.
రెమ్యునరేషన్ రికార్డులు..
అన్నట్టు, ‘రంగస్థలం’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌కి పూజా హెగ్దే రికార్డు స్థాయి రెమ్యునరేషన్ అందుకుంది. ఆ సినిమా హిట్టు రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!
ఇక, ‘ఎఫ్-3’ సినిమా కోసం కూడా, పూజా హెగ్దేకి కేవలం స్పెషల్ సాంగ్‌కే బీభత్సమైన రెమ్యునరేషన్‌ని నిర్మాతలు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది.
Also Read: సమీక్ష: శ్రీవిష్ణు ‘సింగిల్’.. దీన్ని ‘హాస్యం’ అనగలమా.?
ఇప్పుడీ ‘మోనిక’ స్పెషల్ సాంగ్ ‘కూలీ’ కోసం పూజా హెగ్దే గట్టిగానే ఛార్జ్ చేసిందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.