Table of Contents
Shreya Dhanwanthary Super Man.. అదేమీ, ఆమె నటించిన సినిమా కాదు. కానీ, ఆ సినిమాలోని ‘ముద్దు సీన్’ తొలగించడంపై ఆమెకి చాలా కోపమొచ్చేసింది.
డబ్బులు ఖర్చు చేసి, టిక్కెట్ కొనుక్కుని, సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులకు, వారు తెరపై ఏం చూడాలనుకుంటున్నారో, అది చూసే హక్కు వుందని సెలవిచ్చిందామె.
సెన్సార్ నిబంధనలు నటీనటులకి తెలియవని ఎలా అనుకోగలం.? తెలిసే అమాయకత్వం ప్రదర్శిస్తోందా.? ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా.? ఎవరామె.?
Shreya Dhanwanthary Super Man.. శ్రేయకీ.. ఆ ముద్దు సీన్ మీద అంత ప్రేమేంటి.?
అదేమో, ‘సూపర్ మ్యాన్’ సినిమా. అందులోని 33 సెకెన్ల పాటు సాగే ఓ ముద్దు సన్నివేశానికి సెన్సార్ బోర్డ్ ‘కత్తెర’ వేటు వేసింది.
అసలు సెన్సార్ బోర్డ్ ఎలా పని చేస్తుంది.? సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఎలాంటి పద్ధతులు పాటిస్తారు.? ఎలాంటి నిబంధనల్ని పరిగణనలోకి తీసుకుంటారు.? అన్నవి నటిగా ఆమెకి తెలియాలి కదా.?

ఆమె పేరు శ్రేయా ధన్వంతరి. తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసింది. హిందీలో కొన్ని సినిమాలు చేసింది. ఈ మధ్యన కొన్ని వెబ్ సిరీస్‌లలో కనిపిస్తోంది.
సోషల్ మీడియా వేదికగా శ్రేయా ధన్వంతరి గ్లామరస్ ఫొటోలకు ఆకాశమే హద్దు. ఆ స్థాయిలో ఆమె గ్లామర్‌తో చెలరేగిపోతుంటుంది.
ముద్దు సీన్లకు కత్తిరింపులు ఎందుకంటే..
‘యు’ సర్టిఫికెట్, ‘యు/ఎ’ సర్టిఫికెట్, ‘ఎ’ సర్టిఫికెట్.. ఇలా సెన్సార్ బోర్డ్, సర్టిఫికెట్లను జారీ చేస్తుందని అందరికీ తెలుసు కదా.
చిన్న పిల్లలతో కలిసి చూసే సినిమాలకు ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ రావాలంటే, అభ్యంతరకర సన్నివేశాలు, హింసాత్మక సన్నివేశాలు వుండకూడదు. అద్గదీ అసలు సంగతి.

‘ముద్దు సన్నివేశం’ శ్రేయా ధన్వంతరికి బాగా నచ్చి వుండొచ్చు. పిల్లలతో అలాంటి సీన్స్ చూసేందుకు తల్లిదండ్రులు ఇబ్బంది పడొచ్చు కదా.? అందుకే, సెన్సార్ బోర్డ్, ‘కత్తిరింపు’ విధించిందని అనుుకోవాలి.
పబ్లిసిటీ స్టంట్ కాదు కదా..
ఇంతకీ, ఈ వివాదంలో శ్రియా ధన్వంతరికి ఎంత పబ్లిసిటీ ఉచితంగా లభించి వుండొచ్చు.? సోషల్ మీడియా వేదికగా ఆమె ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి.
Also Read: ‘కుబేర’ రివ్యూ.! లక్ష కోట్లు వర్సెస్ ఓ బిచ్చగాడు.!
ఈ ముద్దు ముచ్చట అంశం పేరుతో శ్రేయా ధన్వంతరి గురించి చర్చ గట్టిగానే నడుస్తోంది సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. ఇంతకన్నా ఆమె కోరుకునేందేముంటుంది.?