Table of Contents
Natural Protein Powder Making.. శరీరం ఆరోగ్యంగా శక్తివంతంగా వుండాలంటే ప్రొటీన్లు చాలా అవసరం అన్న సంగతి తెలిసిందే.
మరి, శరీరానికి కావల్సిన ప్రొటీన్లు ఎలా అందుతాయ్.? ఖచ్చితంగా మనం తీసుకునేా ఆహారం ద్వారానే.
నేచురల్‌గా మనం తీసుకునే ఆహారంలో కొన్ని ప్రొటీన్లు మిళితమై వుంటాయ్. కానీ, ఆ ప్రొటీన్లు శరీరానికి సరిపడా శక్తిని అందించడంలో పూర్తిగా సహకరిస్తాయా.?
అందుకే మార్కెట్లో లభించే ఆర్టిఫిషియల్ ప్రొటీన్ పౌడర్లను వాడుతూ వుంటారు కొంతమంది.
అవి నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తాయా.? శరీరానికి తగిన శక్తిని అందిస్తాయా.? అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నే.
Natural Protein Powder Making.. ఎటువంటి కెమికల్స్ వాడకుండా.!
ఎందుకంటే, ఆయా ప్రొటీన్ పౌడర్ల తయారీలో భాగంగా కొన్ని రకాల రసాయనాలు కూడా మిక్స్ చేయాల్సి వస్తుంది. సో, మార్కెట్లో లభించే ప్రొటీన్ పౌడర్లు ఎంతవరకూ సేఫ్.?
ఆ టెన్షన్ లేకుండా.. ఇంట్లోనే నేచురల్ పద్ధతిలో ప్రొటీన్స్ తయారు చేసుకోవడమెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.!

ఇంట్లో రెగ్యులర్‌గా ఉపయోగించే ఐటెమ్స్తోనే ఆరోగ్యకరమైన ప్రొటీన్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు. అందుకోసం కావల్సిన పదార్ధాలు ఏంటో తెలుసుకుందాం.
వంట గదిలో సులువుగా దొరికే ఐటెమ్స్తోనే.!
కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు, జొన్న గింజలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, అవిసె గింజలు, నువ్వులు..
అలాగే, బాదం పప్పు, జీడిపప్పు, పల్లీలు వంటి నట్స్ కూడా తీసుకోవాలి. వీటన్నింటినీ సమానమైన రేషియోలో తీసుకుంటే సరిపోతుంది.

వీటితో పాటూ, కొంచెం ఎండు కొబ్బరి కూడా తీసుకోవాలి. అలాగే తీపి కోసం కొద్దిగా బెల్లం లేదా ఖర్జూరం తీసుకోవాలి.
పైన చెప్పిన పప్పులన్నింటినీ విడి విడిగా దోరగా వేయించి పెట్టుకోవాలి (ఆయిల్ లేకుండానే).
నిల్వ చేసేటప్పుడు జాగ్రత్త..
అలా వేయించిన పప్పులు, వాల్ నట్స్ మిక్సీలో వేసి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. దానికి బెల్లాన్నీ, ఎండు కొబ్బరిని యాడ్ చేయాలి. ఫైబర్ కోసం కొన్ని ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
Also Read: ‘టెక్కు’నాలజీతో ఏఐ బొమ్మల్.! నువ్విస్తానంటే.. నేనొద్దంటానా.!
ఇలా తయారు చేసిన పౌడర్ని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే కొన్ని నెలల పాటు తినొచ్చు. ఆరోగ్యంగా వుండొచ్చు.
ఈ ప్రొటీన్ పౌడర్ని మిల్క్ షేక్స్‌లో కానీ, ఏదైనా ఫ్రూట్ సలాడ్స్, లేదా జ్యూస్‌లలో వాడుకోవచ్చు. పిల్లలతో పాటూ, పెద్ద వాళ్లూ ఈ ప్రొటీన్ పౌడర్ని ఇష్టపడతారు. లెట్స్ ట్రై దిస్.!
