Naga Shaurya Rangabali నాగ శౌర్య అంటే, పక్కింటి కుర్రాడే.! ఔను, అలాగే వుంటాడు. నేల విడిచి సాము చేయడం అతనికి కలిసి రావడంలేదు.
అదే సమయంలో, మరీ డల్ క్యారెక్టర్స్ అస్సలు సెట్ కావడంలేదు. తన బలమేంటో గుర్తెరిగి సినిమాలు చేయడం లేదు నాగ శౌర్య.
కానీ, ఈసారి నాగ శౌర్య (Naga Shaurya) గట్టిగానే హిట్టు కొట్టేలా వున్నాడు. ‘రంగబలి’ సినిమాతో త్వరలో నాగ శౌర్య ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Naga Shaurya Rangabali.. ప్రోమో అదిరింది..
‘రంగబలి’ (Rangabali Movie) సినిమా నుంచి వచ్చిన ప్రోమో, ఇప్పుడందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. గోదారి యాసలో నాగ శౌర్య ఒదిగిపోయాడనడం అతిశయోక్తి కాదేమో.
హీరోయిన్ యుక్తి తరేజీ క్యూట్ అండ్ లవ్లీగా ఆకట్టుకుంటోంది. తండ్రీ కొడుకుల మధ్య ర్యాగింగ్.. ఈ సినిమాలో బాగా వర్కవుట్ అయినట్లే కనిపిస్తోంది.
అయితే, ప్రోమో చూసి.. సినిమా మీద ఓ జడ్జిమెంట్ పాస్ చేసెయ్యలేం.! ఎందుకంటే, కొన్నిసార్లు ప్రోమోలు మోసం చేస్తాయ్. కొన్నిసార్లే కాదు, చాలా సార్లు.
అయినాగానీ, సమ్‌థింగ్ ఎట్రాక్టివ్‌గానే వుంది ‘రంగబలి’.!
నాగ శౌర్య (Naga Shaurya) ఈజ్ చూస్తే, అతనికి ఈ ‘రంగబలి’ స్క్రిప్ట్ ఎంత బాగా సూట్ అయ్యిందో.. అన్న భావన కలగకమానదు.
Also Read: Tillu Square: టిల్లుగాని ‘ఆ’ డోసు కూడా ‘స్క్వేర్’ అయ్యిందే.!
మాస్ మెచ్చే యాక్షన్ ఎలిమెంట్స్.. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే ఎంటర్టైన్మెంట్.. యూత్ మెచ్చే రొమాన్స్.. అన్నీ కలగలిసినట్లే కనిపిస్తోంది ‘రంగబలి’.!
చూద్దాం.. నాగ శౌర్య (Naga Shaurya) అదృష్టం ఈసారి ఎలా వుందో.!