OG Vs Koolie.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఓజీ’ నుంచి, ‘ఫైర్ స్టార్మ్’ సాంగ్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే.
మరోపక్క, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమా ట్రైలర్ కూడా నిన్ననే విడుదలైంది. రెండూ ఒకే రోజు విడుదలవడం గమనార్హం.
‘ఓజీ’ తెలుగు సినిమా, ‘కూలీ’ తమిళ సినిమా. ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది గనుక, రెండిటినీ పాన్ ఇండియా సినిమాలుగానే చూడాలి.
OG Vs Koolie.. ఎవరి రేంజ్ ఎంత.?
అయితే, తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి వుండే రేంజ్ ఎంత.? తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌కి వుండే రేంజ్ ఎంత.? అన్నదానిపై డిస్కషన్స్ అనవసరం.
ఎవరి రేంజ్ వారిదే. తెలుగులో, రజనీకాంత్‌కి మంచి మార్కెట్ వుంది. అలాగని, పవన్ కళ్యాణ్ సినిమాని దాటేంత రేంజ్ ‘కూలీ’కి లేదు కదా.!
పోనీ, నాగార్జున కూడా ‘కూలీ’లో వున్నాడు కాబట్టి.. అని, ‘ఓజీ’ మార్కెట్‌తో ‘కూలీ’ మార్కెట్‌ని పోల్చగలమా.? అస్సలు కుదరదు.!
కామెడీ కాకపోతే ఏంటి.?
అలాంటిది, ‘ఓజీ’ సాంగ్‌నీ, ‘కూలీ’ సాంగ్‌నీ పోల్చితే, ఇంకెంత కామెడీగా వుంటుంది.? పవన్ కళ్యాణ్ అంటే, గిట్టని ఓ వర్గం మీడియా, ‘కూలీ’ ట్రైలర్‌తో పండగ చేసుకోవడంలో వింతేమీ లేదు.
పవన్ కళ్యాణ్ – రజనీ కాంత్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. పైగా, రజనీ కాంత్ అంటే, పవన్ కళ్యాణ్‌కి బోల్డంత గౌరవం కూడా.
Also Read: Sarzameen Telugu Review: తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం.!
రజనీ కాంత్ అభిమానులకీ, పవన్ కళ్యాణ్ అభిమానులకీ మధ్య చిచ్చు పెట్టి, తద్వారా పైశాచికానందం పొందుదామని కొందరు అనుకోవచ్చుగాక.!
‘కూలీ’, ‘ఓజీ’.. ఈ రెండు సినిమాల రిలీజ్ ఒకేసారి కాదు.! ఈ ఆగస్టులో ‘కూలీ’ వచ్చేస్తోంది. సెప్టెంబర్‌లో ‘ఓజీ’ వస్తుంది. సో, రెండిటి మధ్యా క్లాష్, పోలిక.. పూర్తిగా నాన్సెన్స్.!