Prakash Raj Tirupathi Laddu.. విషయమేమో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి సంబంధించినది.!
కానీ, స్పందించినదేమో.. హిందూ మతంతో అస్సలేమాత్రం సంబంధం లేని సినీ నటుడు ప్రకాష్ రాజ్.! అసలు నువ్వెవడివి స్పందించడానికి ప్రకాష్ రాజ్.?
భారత దేశ పౌరుడిగా, భారత దేశానికి సంబంధించిన ఏ అంశం మీదనైనా మాట్లాడే స్వేచ్ఛ ప్రకాష్ రాజ్‌కి వుండొచ్చుగాక.!
ప్రపంచానికి సంబంధించిన విషయాలపైనా ప్రకాష్ రాజ్ తన అభిప్రాయం వెలిబుచ్చవచ్చుగాక.!
కానీ, హిందూ ధర్మానికి తూట్లు పొడిచే ప్రక్రియ నడుస్తున్నప్పుడు, దాని గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకూడదని చెప్పడానికి ప్రకాష్ రాజ్ ఎవడు.?
జాతీయ స్థాయిలో సనాతన ధర్మాన్ని కాపాడే దిశగా ఓ ప్రయత్నం జరగాలని జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఇందులో తప్పేముంది.?
కానీ, ప్రకాష్ రాజ్‌కి.. పవన్ కళ్యాణ్ ట్వీట్‌లో ‘మత విద్వేషాలు రెచ్చగొట్టే అంశం’ ఏదో కనిపించింది.! ఔను, పచ్చ కామెర్లు వున్నోడికి, లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది.!
Prakash Raj Tirupathi Laddu.. మత పరమైన ఉద్రిక్తతలా.? ఏం మాట్లాడుతున్నావ్.?
‘మీరెందుకు అనవసరమైన భయాలు కల్పించి జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు? మన దేశంలో ఇప్పటికే వున్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు. కేంద్రంలో వున్న మీ స్నేహితులకు ధన్యవాదాలు..’
ఇదీ ప్రకాష్ రాజ్ ట్వీట్.! తగుదునమ్మా.. అని ప్రకాష్ రాజ్ ఎందుకు దూసుకొచ్చినట్లు.? ఏ హిందూ వ్యతిరేకి ఇలా ప్రకాష్ రాజ్‌తో ఈ ట్వీట్ వేయించినట్లు.?
ఎవడు వేసిన బిచ్చానికి కక్కుర్తి పడి ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ వేసినట్టు.? ఇంతకీ, హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన అంశంపై మాట్లాడే నైతిక హక్కు నీకెవడిచ్చాడు.?
అసలంటూ నువ్వెవడివి ప్రకాష్ రాజ్.! నువ్వెప్పుడైనా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని భక్తితో కొలిచావా.? లడ్డూ ప్రసాదం తిన్నావా.?
ఏదైనా హిందూ ధార్మిక సంస్థకి నీ స్వార్జితాన్ని విరాళంగా ఇచ్చావా.? లేదు కదా, నవ రంధ్రాలూ మూస్కుని వుండు.! నీకు సంబంధం లేని విషయాల్లో తల దూర్చకు.!