Table of Contents
Nidhhi Agerwal Bhimavaram Car.. ‘ఎద్దు ఈనిందిరోయ్..’ అని ఎవడో అంటే, ‘అయితే, వెంటనే దూడని కట్టెయ్..’ అన్నాడట ఇంకొకడు.! ఇది మనందరికీ తెలిసిన సామెతే.!
మీడియా ముసుగులో పాత్రికేయ వ్యభిచారమ్ బాగా ఎక్కువైపోయింది కదా.! దానికి తోడు, సోషల్ మీడియాలో ‘ఐదు’ రూపాయలకి కక్కుర్తి పడే బ్యాచ్ ఒకటి.!
ఏదన్నా వార్తే.. అది నిజమా.? కాదా.? అన్నది అనవసరం.! వైరల్ చేసి పడెయ్యాలి.. నెత్తుటి కూడు, కక్కిన కూడు.. ఏదైతేనేం కడుపు నింపుకోవడానికి.. అన్నట్లు తయారైంది పరిస్థితి.
Nidhhi Agerwal Bhimavaram Car.. నిధి అగర్వాల్.. అసలేమైంది.?
నటి నిధి అగర్వాల్, ఇటీవల ‘హరి హర వీర మల్లు’ సినిమాలో నటించింది. సినిమా ప్రచార బాధ్యతల్ని పూర్తిగా తన భుజ స్కందాల మీద మోసింది.
అందుకే, ఆ సినిమా హీరో పవన్ కళ్యాణ్ నుంచి కూడా ప్రశంసలు అందుకుంది నిధి అగర్వాల్. ‘నిధి అగర్వాల్‌ని చూసి సిగ్గు తెచ్చుకున్నా..’ అని పవన్ కళ్యాణ్, పలు వేదికలపై చెప్పారు కూడా.

అది ఆయన పెద్ద మనసు.! ప్రచార బాధ్యతలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాకనే, ‘హరి హర వీర మల్లు’ సినిమాకి హైప్, వేరే లెవల్‌కి వెళ్ళిందనుకోండి.. అది వేరే చర్చ.
ఇక, నిధి అగర్వాల్ భీమవరంలో ఓ కార్యక్రమానికి హాజరైంది. ఈ క్రమంలో ఆమె ప్రయాణించిన కారు చుట్టూ పెద్ద రచ్చ మొదలైంది.
కారు.. పుకారు.. మీడియా దిగజారు..
నిధి అగర్వాల్ ప్రయాణించిన కారుకి ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అని వుంది. అది వివాదాస్పదమయ్యింది. ‘ప్రభుత్వ వాహనం’ అని వుంటే, అది ప్రభుత్వానికి చెందినది.
కానీ, ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అంటే, ప్రభుత్వావసరాల నిమిత్తం, తాత్కాలికంగా అద్దెకు తీసుకునే వాహనాలకు వాడుతుంటారు దాన్ని కొందరు.

మిగతా సమయాల్లో, సదరు కార్లను వాటి యజమానులు, డ్రైవర్లు.. కమర్షియల్ వినియోగం కోసం ఉపయోగించడం సర్వసాధారణం. అలా, నిధి అగర్వాల్ ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ కారులో ప్రయాణించిందన్నమాట.
ఏ కార్యక్రమం కోసం భీమవరం వెళ్ళిందో, ఆ కార్యక్రమ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కారు అది.
ప్రభుత్వానికి ఏంటి సంబంధం.?
ఈ మొత్తం వ్యవహారంపై నిధి అగర్వాల్ వివరణ ఇచ్చింది. ఆ కారుని నిర్వాహకులు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇందులో ప్రభుత్వానికేమీ సంబంధం లేదనీ చెప్పింది.
పైగా, ఈ మొత్తం వివాదంతో అసలు తనకు ఏమీ సంబంధం లేదని, నిర్వాహకులు ఏర్పాటు చేసిన కారులో వెళ్ళడం తప్పెలా అవుతుందని నిధి అగర్వాల్ పేర్కొంది.
Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది.? నచ్చితే బద్దలుగొట్టెయ్యండి.!
ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించాల్సి వుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోంటే, ప్రభుత్వ వ్యవస్థలు చోద్యం చూడటం సబబు కాదు.
మరీ ముఖ్యంగా, మీడియా ముసుగులో పాత్రికేయ వ్యభిచారం నడుపుతున్నవారిపై చట్ట పరంగా ఉక్కుపాదం మోపాల్సిందే.