Sai Dharam TeJ Bro: ప్చ్.! నిన్ను అలా చూడలేం బ్రో.!

 Sai Dharam TeJ Bro: ప్చ్.! నిన్ను అలా చూడలేం బ్రో.!

Sai Dharam Tej Bro

Sai Dharam Tej Bro.. కొన్నాళ్ళ క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు సాయి ధరమ్ తేజ్.! ప్రాణాపాయం నుంచి గట్టెక్కాడు.. కానీ, కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.

ఓ దశలో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుందనే ప్రచారమూ జరిగింది.

‘నేను బతుకుతానని అనుకోలేదు..’ అనే మాట సాయి ధరమ్ తేజ్ నుంచి ఇటీవల బయటకు వచ్చింది కూడా.!

కోలుకున్నాడు.. ‘విరూపాక్ష’ సినిమాతో హిట్టుకొట్టాడు కూడా.! ఆ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పాత్ర చనిపోతుందేమోనని అంతా అనుకున్నారు.

Sai Dharam Tej Bro.. ‘బ్రో’ కోసం తప్పదు..

‘విరూపాక్ష’ కంటే ముందు వచ్చిన సినిమా గుర్తుంది కదా.? ‘రిపబ్లిక్’. ఆ సినిమా ఎండింగ్ అస్సలేమాత్రం మింగుడుపడదు. సాయి ధరమ్ తేజ్ పాత్ర చనిపోతుంది.

‘బ్రో’ సినిమాలోనూ సాయి ధరమ్ తేజ్ పాత్ర చనిపోవాలి. తమిళ ‘వినోదయ సితం’లో అయితే అంతే.! తెలుగులో అందుకు భిన్నంగా వుండకపోవచ్చు.

కానీ, రోడ్డు ప్రమాదంలో చనిపోయే సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) పాత్రకి, ‘టైమ్’ దేవుడి రూపంలో పవన్ కళ్యాణ్ తారసపడటం.. దీన్ని అభిమానులెలా జీర్ణించుకోగలరు.?

Bro Teaser Review
Bro Teaser Review

అసలంటూ, ఫన్ మొదలయ్యేదే ఆ తర్వాత.. ఈ సినిమాలో.! కానీ, చివర్లో ఏమవుతుంది.? ఆ ఎమోషనల్ సన్నివేశాలు.. మామూలుగా వుండవ్.!

‘ఆచార్య’లో మరీ దారుణం.!

‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చనిపోతుంది. చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా అది.

తండ్రీ కొడుకులు కలిసి చేసిన సినిమాని, దర్శకుడు కొరటాల శివ అలా ఎలా డిజైన్ చేసినట్టు.? ‘ఆచార్య’ ఆ స్థాయి ఫ్లాప్ అవడానికి అది కూడా ఓ కారణం.

Also Read: Krithi Shetty.. బేబమ్మా.! ఇలా అయ్యిందేంటమ్మా.?

హీరో పాత్రలు చనిపోవడం కొత్త విషయం కాదు. కానీ, ఆ ఎమోషన్ అన్నిసార్లూ వర్కవుట్ కాదు.! ‘బ్రో’ కథని పరిగణనలోకి తీసుకుంటే, వర్కవుటయ్యే అవకాశాలే ఎక్కువ.!

కానీ, ఆ రోడ్డు ప్రమాదం.. నిజ జీవితంలోనూ సాయి ధరమ్ తేజ్‌కి జరిగింది గనుక.. అభిమానులు అంత తేలిగ్గా జీర్ణించుకోలేరు.

Digiqole Ad

Related post