Table of Contents
War2 Review.. ‘స్పై’ సినిమాలు చాలా చూసేశాం. ఇంకా చాలా చూడబోతున్నాం. ట్రెండ్ మారింది.. అందరూ సీక్రెట్ ఏజెంట్లే ఇప్పుడు.!
ఒకే కథతో బోల్డన్ని ‘స్పై థ్రిల్లర్స్’ తెరకెక్కుతున్నాయి. రాను రాను.. అవి నీరసంగా మారిపోతున్నాయి కూడా.!
ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, ప్రముఖ టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీయార్ కలిసి నటించారు ‘వార్-2’ అనే స్పై థ్రిల్లర్ సినిమాలో.
యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణం.. అయాన్ ముఖర్జీ దర్వకత్వం.. కియారా అద్వానీ బికినీ గ్లామర్.. వెరసి, ‘వార్-2’ సినిమాపై ప్రీ రిలీజ్ బజ్ ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యింది.
ఇంతకీ, ‘వార్-2’ ప్రీ రిలీజ్ నెలకొన్న హైప్‌ని రీచ్ అయ్యిందా.. విడుదలయ్యాక.? అసలు సినిమా కథ, కమామిషు ఏంటి.? తెలుసుకుందాం పదండిక.
War2 Review.. చప్ప చప్పగా..
‘స్పై థ్రిల్లర్’ అంటే ఎలా వుండాలి.? తెరపై అత్యద్భుతమైన యాక్షన్ సీక్వెన్సెస్ వుండాలి.. కథలో డెప్ట్ వుండాలి.. ఎమోషన్స్ వర్కవుట్ అవ్వాలి.
ప్చ్, ఇవేవీ ‘వార్-2’ సినిమాలో లేవు. హృతిక్ రోషన్ కష్టపడ్డాడు, జూనియర్ ఎన్టీయార్ కష్టపడేందుకు ప్రయత్నించాడు.
హీరో కియారా అద్వానీ మాత్రం మొహమాటం లేకుండా, అందాల ప్రదర్శన చేసేసింది. జూనియర్ ఎన్టీయార్ నెగెటివ్ షేడ్స్ వున్న రోల్‌లో తేలిపోయాడు.
హృతిక్ రోషన్ గతంలో స్పై థ్రిల్లర్స్ చేశాడు. ‘వార్’లో అయితే, టైగర్ ష్రాఫ్‌తో కలిసి.. అదరగొట్టేశాడు. కానీ, ‘వార్-2’కి వచ్చేసరికి, ‘జీరో’ కథ.! హృతిక్ సైతం ఏం చేయలేడు.. ఇలాంటి కథలకి.
వీఎఫ్ఎక్స్.. డిజాస్టర్..
ఈ మధ్య ఏ సినిమా వచ్చినా, కథ అలానే కథనాల గురించి మాట్లాడుకోవడం మానేసి, వీఎఫ్ఎక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
కథ లేదు సరికదా, కథనం సరిగ్గా లేదు సరికదా.. వీఎఫ్ఎక్స్ మాత్రం సరిగ్గా ఎందుకు వుండాలనుకున్నారో ఏమో, పరమ వరస్ట్.. అనే స్థాయిలో వీఎఫ్ఎక్స్‌ని తీర్చిదిద్దారు.
దాంతో, తెరపై సినిమా నడుస్తోంటే, ప్రేక్షకుల్లో నీరసం ఆవహించింది. సినిమా మొదలైన కాస్సేపటికే, ప్రేక్షకులు నిట్టూర్చుతూ, నిద్రలోకి జారుకునే పరిస్థితి వచ్చింది.
తెరపై కంటెంట్ రిచ్‌గా కనిపించడానికి కోట్లు ఖర్చు చేస్తే సరిపోద్ది.. అనుకుంటే పొరపాటు, కథలో ప్రేక్షకుల్ని లీనమయ్యేలా చేయగలగాలన్న కనీసపాటి లాజిక్ మిస్ అయ్యింది టీమ్.
ఎన్టీయార్.. ఎందుకిలా.?
బాలీవుడ్ ఎంట్రీ, జూనియర్ ఎన్టీయార్‌కి డిజాస్టర్‌నే మిగిల్చిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీయార్ కాలరెగరేశాడు. అభిమానుల్ని ఏమార్చాడు.
హృతిక్ రోషన్, తప్పక.. జూనియర్ ఎన్టీయార్‌తో కలిసి కాలర్ ఎగరేశాడని అనుకోవాలేమో.! లేకపోతే, ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్నాక, హృతిక్ ఎలా కాలర్ ఎగరేయగలిగినట్టు.?
సినిమా వర్కవుట్ అవ్వాలంటే, ఇలాంటి సినిమాల్లో బ్యాలెన్స్ ముఖ్యం. విలన్ గ్యాంగ్‌ని ఓ రేంజ్‌లో చూపించి, చప్పగా దాన్ని తేల్చేస్తే.. ఇలాగే వుంటుందేమో.
స్టార్లున్నారు.. ఎలా తీసేసినా చెల్లిపోతుందని బహుశా నిర్మాణ సంస్థ, దర్శకుడు అనుకుని వుంటారు. లేకపోతే, ఇలాంటి నాసిరకం సినిమాని ఎలా తెరకెక్కిస్తారు.?
కేవలం కియారా అద్వానీని టూ పీస్ బికినీలో బిగ్ స్క్రీన్ మీద చూపించడానికేనా ఈ ‘వార్-2’ సినిమా.. అనేంతలా ప్రమోషన్స్ నడిచాయ్.