Tamannaah Bhatia Transformation.. తమన్నా అంటే, మిల్కీ బ్యూటీ.! ‘ప్లీజ్, నన్ను మిల్కీ బ్యూటీ అనొద్దు..’ అని తమన్నా అంటుందనుకోండి.. అది వేరే సంగతి.
వద్దన్నాసరే, తమన్నాని మిల్కీ బ్యూటీ అనే పిలుస్తుంటారు. ఆ పేరు, ఆమెకి అలా స్థిరపడిపోయింది మరి.! తెలుగుతోపాటు తమిళ, హిందీ.. ఇలా పలు భాషల్లో సినిమాలు చేసింది తమన్నా.
సినిమాల్లో హీరోయిన్ రోల్స్ మాత్రమే కాదు, స్పెషల్ సాంగ్స్ కూడా చేయడానికీ వెనుకాడదు ఈ మిల్కీ బ్యూటీ.
హీరోయిన్‌గా పాటల్లో డాన్సులేసినప్పుడు, స్పెషల్ సాంగ్స్‌లో చేస్తే తప్పేంటి.? అని తమన్నా ప్రశ్నిస్తుంటుంది.
Tamannaah Bhatia Transformation.. సినిమాలు తగ్గించి.. అక్కడ పెంచేసి..
ఇక, ఈ మధ్య తమన్నా ఎక్కువగా హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లకే పరిమితమవుతోంది. వెబ్ సిరీస్‌ల మీద తమన్నా స్పెషల్ ఫోకస్ పెట్టడానికి కారణమేంటో తెలుసా.?
నిజానికి, తమన్నా మాత్రమే కాదు, చాలామంది నటీనటులు, వెబ్ సిరీస్‌ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు. అందుకు బలమైన కారణమూ లేకపోలేదు.

సినిమాలతో పోల్చితే, నటీనటులకు ఇప్పుడు వెబ్ సిరీస్‌ల ద్వారా రీచ్ ఎక్కువ వుంటోంది. పైగా, వెబ్ సిరీస్‌లకు ‘సెన్సార్’ సమస్యలు కూడా తక్కువే.
అలాగని, అన్నిట్లోనూ బూతు వుంటుందనుకుంటే పొరపాటే. కాకపోతే, శృతి మించిన గ్లామర్ వెబ్ సిరీస్‌లో ఒకింత ఎక్కువే. హద్దులు దాటే శృంగార సన్నివేశాలు, బూతు డైలాగులు.. వెబ్ సిరీస్‌ల పంచాయితీ వేరే.
Also Read: Sarzameen Telugu Review: తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం.!
అయితే, వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి కంటెంట్ ప్రేక్షకులకు ఇవ్వగలుగుతున్నామని తమన్నా అంటోంది.
సినిమాల ద్వారా చెప్పలేని మంచి మంచి కథల్ని వెబ్ సిరీస్‌ల ద్వారా చెప్పవచ్చునన్నది తమన్నా అభిప్రాయం.
అందుకే, గ్లామర్ విషయంలో స్వయంగా విధించుకున్న కొన్ని పరిధులు దాటి, వెబ్ సిరీస్‌ల కోసం ముందడుగు వేసినట్లు తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
అయినా, తమన్నా వెండి తెర మీద చేయని గ్లామర్ షో ఏమైనా వుందా.? ఏంటీ.!