Malaika Masala Arora.. బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ ఫర్ మలైకా అరోరా.!
వయసు మీద పడుతున్నా వన్నె తగ్గని అందం.. అని అంటుంటాం కదా.. మలైకా అరోరా గురించి అలాగే చెప్పుకోవాల్సి వుంటుంది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘కెవ్వు కేక’ అంటూ స్పెషల్ సాంగ్ కోసం ఆడిపాడింది మలైకా అరోరా.
Malaika Masala Arora.. పెళ్ళి.. విడాకులు.. గ్లామరు..
మలైకా అరోరాకి పెళ్ళయ్యింది.. విడాకులు కూడా అయిపోయాయి.. ఎదిగిన కొడుకున్నాడు. అయితేనేం, గ్లామర్ విషయంలో అస్సలేమాత్రం తగ్గదీ బ్యూటీ.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ అండ్ వైల్డ్ ఫొటోల్ని షేర్ చేస్తూ, తన పాపులారిటీని రోజు రోజుకీ పెంచుకుంటూ పోతోంది.

మలైకా గ్లామర్ సీక్రెట్ ఏంటి.? అని అంతా విస్తుపోతుంటారంటే అతిశయోక్తి కాదేమో. అలా ఆమె ఫిట్నెస్ ఎలా మెయిన్‌టెయిన్ చేస్తోందో ఎవరికీ అర్థం కాదు.
అదే మ్యాజిక్.. అని చెబుతుంటుంది మలైకా అరోరా. అంతలోనే.. యోగా, స్విమ్మింగ్, డాన్సింగ్.. వీటితోపాటు రెగ్యులర్ వర్కవుట్స్ తన ఫిట్‌నెస్‌కి కారణం అని చెప్పడం మలైకా స్పెషల్.
పైవాటన్నిటితోపాటు, ఎప్పుడూ ఆనందంగా వుంటే.. అదే ఆరోగ్యం అనీ.. ఆరోగ్యంగా వుంటేనే, పైన చెప్పుకున్నవన్నీ ఆనందంగా చేయగలమనీ మలైకా అరోరా ఓ సందర్భంలో చెప్పింది.
మలైకా మసాలా..
తాజాగా, మలైకా ‘మసాలా’ అనే ఓ మ్యాగజైన్ కోసం ఇదిగో ఇలా పోజులిచ్చింది. ఈ ఫొటోలిప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
Also Read: తొలగిస్తే, ‘బంధం’ తెగిపోయినట్లే..నా!?
సోషల్ మీడియాలో షరామామూలుగానే మలైకా అరోరాని ట్రోల్ చేస్తుంటారనుకోండి.. అది వేరే సంగతి. అలాగని, ఆమె అందాల ప్రదర్శన ఆపేస్తుందా.? ఛాన్సే లేదు.!

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, యంగ్ బ్యూటీస్ సైతం ముక్కున వేలేసుకునే గ్లామర్ మలైకా సొంతం. ఫిట్‌నెస్ విషయంలో, కాన్ఫిడెన్స్ విషయంలో.. మలైకాని ‘తోపు’ అంతే.! ‘తోపు’ కాకపోతే ఏంటి.?
మలైకా వయసు 51.. ఈ వయసులో ఈ స్థాయి ఫిట్‌నెస్, గ్లామర్, ఆరోగ్యం, అందం.. మామూలు విషయం కాదు మరి.