Pushpa The Rule Twist.. ‘పుష్ప ది రైజ్’ సినిమా సాధించిన విజయం గురించి కొత్తగా చెప్పేదేముంది.? స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన సినిమా ఇది.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, అల్లు అర్జున్ (Allu Arjun) మార్కెట్ పెంచడమే కాదు, మొత్తంగా ‘పుష్ప’ టీమ్ మీద మరింత బాధ్యతను పెంచేసింది. దానిక్కారణం, ‘పుష్ప ది రూల్’ కూడా వస్తుందని ముందే ప్రకటించేయడమే.
నిజానికి, ‘పుష్ప ది రైజ్’లో (Pushpa The Rise) కొన్ని మైనస్సులున్నాయి. అవి ‘పుష్ప’ (Pushpa) మేనియాలో కొట్టుకుపోయాయ్. కానీ, ‘పుష్ప ది రూల్’కి ఏ చిన్న పొరపాటు చేసినా, అది పెద్ద బ్లండర్ అయి తీరుతుంది.
ఈ నేపథ్యంలో, దర్శకుడు సుకుమార్ (Director Sukumar) తగినంత సమయం తీసుకుని, అత్యంత జాగ్రత్తగా ‘పుష్ప ది రూల్’ కథకి మార్పులు చేర్పులు చేస్తున్నాడు.
Pushpa The Rule Twist.. కేజీఎఫ్ బాటలో పుష్ప.!
ఇదిలా వుంటే, ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule) కోసం, ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ (Kgf Chapter 2) థీమ్ తీసుకుంటున్నాడట సుకుమార్ అన్నది తాజా గాసిప్. ఈ మేరకు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వెబ్ మీడియా అయితే, ఈ విషయమ్మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. సినిమా కథ అలా వుంటుందట.. ఇలా వుంటుందట.. అంటూ బోల్డన్ని ఊహాజనిత కథనాలు వెలుగు చూస్తున్నాయి.
‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ (Kgf2) సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుంది. అచ్చంగా అలాంటి సీన్, ‘పుష్ప ది రూల్’లో కూడా వుంటుందట… ఇలాబ బోల్డన్ని కథనాలు తెరపైకొస్తున్నాయ్.

అంటే, రష్మిక మండన్న (Rashmika Mandanna) పాత్రని దర్శకుడు సుకుమార్ చంపేయబోతున్నాడన్నమాట.
కానీ, అది కన్విన్సింగ్‌గా వుంటుందా.? వాస్తవానికి, ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ సినిమాలోనూ హీరోయిన్‌ని చంపేయాల్సినంత అవసరమేమొచ్చిందన్న వాదన ఇప్పటికీ గట్టిగానే వినిపిస్తోంది.
శ్రీవల్లి చనిపోతే, కొత్తగా వచ్చేదెవరు.?
ఒకవేళ శ్రీవల్లిని (రష్మిక మండన్న పోషించిన రోల్) చంపేస్తే, ఆ ప్లేస్‌లోకి ఎవరొస్తారు.? ఇంకో పాత్రని సుకుమార్ (Sukumar) ఇప్పటికే డిజైన్ చేసేశాడా.? ఆ రోల్‌లో కనిపించబోయేదెవరు.?
Also Read: సాయి పల్లవీ.! అది తప్పు, ఆ రెండూ ఒక్కటి కాదు.!
ఏమో, సుకుమార్ (Sukumar) మైండ్‌లో ఏం తిరుగుతోందో.! ఆయన ఆలోచనలు ఎలా వుంటాయో ఊహించడం కష్టం. లెక్కల మాస్టారు కదా, ఖచ్చితంగా లెక్కలు పక్కగా వేసుకునే వుంటాడు.!