HAL LCA Tejas Engine.. భారత వైమానిక దళానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన స్వదేశీ తయారీ యుద్ధ విమానం తేజస్, బాలారిష్టాల్ని ఎదుర్కొంటూనే వుంది.
ఇప్పటికే తేజస్ యుద్ధ విమానం భారత వైమానిక దళంలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఇంకా నేవల్ వేరియంట్ విషయంలో గందరగోళం కొనసాగుతోంది.
ఓ వైపు, యుద్ధ విమానాల కొరత భారత వైమానిక దళాన్ని వెంటాడుతోంది. వాస్తవానికి, నావికాదళానికి కూడా తగినన్ని యుద్ధ విమానాలు కావాల్సి వుంది.
HAL LCA Tejas Engine.. మాటలు కోటలు దాటుతున్నాయ్.. చేతలు మాత్రం..
ఆ కొరతని తేజస్ నేవల్ వేరియంట్ తీర్చుతుందని చాలాకాలంగా చెప్పుకుంటూనే వున్నాం. కానీ, మాటలు కోటలు దాటుతున్నాయ్.. చేతలు గడప కూడా దాటడంలేదు.
తేజస్ యుద్ధ విమానం కోసం తయారు చేసిన కావేరీ ఇంజిన్ పని తీరుపై ఎప్పటికప్పుడు కొత్త అనుమానాలు తెరపైకొస్తున్నాయి. ఈ క్రమంలో యుద్ధ ప్రాతిపదికన, విదేశీ తయారీ ఇంజిన్లను దిగుమతి చేసుకుంటున్నాం.
మనం తయారు చేసుకునే ఇంజిన్లు అయితే, సకాలంలో అందుబాటులోకి వస్తాయేమో. విదేశాల నుంచి దిగుమతి.. అంటే, మారిన పరిస్థితుల నేపథ్యంలో కొంత అయోమయం నెలకొంది.
తాజాగా, ఓ ఇంజిన్ భారత వైమానిక దళానికి అందింది. ఇంకోటి త్వరలో రాబోతోంది. ఇప్పటికే నాలుగు ఇంజిన్లు వచ్చాయ్. కానీ, ఇలా ఎన్ని ఇంజిన్ల కోసం ఎదురుచూడగలం.?
మిగ్ స్థానంలో తేజస్.. కానీ, పూర్తి స్థాయిలో ఎప్పుడు.?
మిగ్-21 యుద్ధ విమానాల్ని వైమానిక దళం నుంచి తొలగించిన దరిమిలా, వాటి స్థానంలో తేజస్ యుద్ధ విమానాల్ని పెద్ద సంఖ్యలో భర్తీ చేయాల్సి వుంది.
కానీ, పదుల సంఖ్యలో తేజస్ యుద్ధ విమానాలు, భారత వైమానిక దళంలో చేరాలంటే, అందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇంకోపక్క, అవసరాలు పెరిగిపోతున్నాయి.
Also Read: ఉద్యోగాలన్నీ ఊడిపోతే.! ఆ భయాన్ని అధిగమిస్తేనే భవిష్యత్తు.!
ఆలస్యం.. అమృతం విషం.! కావేరీ ఇంజిన్, అనుకున్న స్థాయి లక్ష్యాల్ని చేరుకోగలిగితే.. తేజస్‌ని మించిన అత్యాధునిక యుద్ధ విమానాలు తయారు చేసుకోగలం.
లేదంటే, షరామామూలే.. యుద్ధ విమానాలు కొనుక్కోవాల్సిందే.! కొనుక్కోవడమా.? తయారు చేసుకోవడమా.? ఈ విషయమై పెద్ద సస్పెన్స్ కొనసాగుతోంది.