Table of Contents
Mirai Success Story… చిన్న హీరో.. చాలా చిన్న హీరో.! బాల నటుడిగా పలు సినిమాల్లో నటించి, వెండితెరపై హీరోగా బుడి బుడి అడుగులు వేస్తున్నాడు.!
‘హనుమాన్’ సినిమాతో చాలా చాలా పెద్ద అడుగు వేశాడు.! అబ్బే, అదేదో గాల్లో రాయి విసిరిన చందాన.. అనుకోకుండా వచ్చిన విజయమేనన్నారు కొందరు.
ఓ ప్రెస్ మీట్‌లో పనీ పాటా లేని కొందరు ఎర్నలిస్టులు, తేజ సజ్జాని చూసి.. అతని స్థాయి గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.
Mirai Success Story.. గట్టిగా.. చాలా గట్టిగా.!
ఇవేవీ మనసులో పెట్టుకోలేదు తేజా సజ్జా. తనదైన రోజున, సక్సెస్‌తోనే మళ్ళీ సమాధానమివ్వాలని అనుకున్నాడు. ఈసారి ఇంకాస్త గట్టిగా సమాధానమిచ్చాడు ‘మిరాయ్’ రూపంలో.
‘మిరాయ్’ సినిమా రిలీజ్‌కి కొద్ది నెలల ముందు, ఈ సినిమాపై చాలా రూమర్స్ క్రియేట్ అయ్యాయి. సినిమా ఆగిపోయిందనే దుష్ప్రచారం కూడా చేశారు కొందరు.
‘హనుమాన్’ సినిమాకే థియేటర్లు దొరకని పరిస్థితి. ‘మిరాయ్’ విషయంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన, హీరో తేజ సజ్జ సహా, చిత్ర బృందాన్ని వెంటాడింది.
సూపర్ హిట్ టాక్..
కట్ చేస్తే, ‘మిరాయ్’ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది.. అదీ భారీ అంచనాల నడుమ. ప్రీమియర్స్ నుంచి సూపర్ హిట్ టాక్ బయటకు వచ్చింది.
మొదటి రోజు, మొదటి ఆట పూర్తయ్యేసరికి.. బ్లాక్‌బస్టర్ టాక్.. అంతటా వినిపించింది. ఇది మామూలు విక్టరీ కాదు.. అంటూ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
నిజానికి, తెలుగు సినిమా ఊపిరి పీల్చుకునే విజయమిది. ఈ మధ్య ఏ సినిమా వచ్చినాసరే, విపరీతమైన నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వస్తోంది.
నెగెటివిటీ.. అంటేనే, అదొక జాడ్యం..
‘మిరాయ్’ సినిమాతో, ఇకపై సినీ పరిశ్రమకి నెగెటివిటీ అనే జాడ్యమే వుండకూడదన్న చర్చ అంతటా జరుగుతోంది.
‘మిరాయ్’తోపాటు విడుదలైన ‘కిష్కింధపురి’ సినిమాకి కూడా వసూళ్ళు బాగానే కనిపిస్తున్నాయ్. ఇదే కావాలి తెలుగు సినీ పరిశ్రమకి.
రెండు మూడు సినిమాలు కాదు, నాలుగైదు సినిమాలు వచ్చినా.. ఇదే పాజిటివిటీ వుండాలి. కేవలం ఈ పాజిటివిటీనే, సినీ పరిశ్రమను కాపాడుతుంది.
చివరగా.. ‘మిరాయ్’ అలానే ‘కిష్కిందపురి’ సినిమాలకీ సమీక్షలు రాసుకుందాం.. మనకేమీ తొందర లేదు. కాస్త తీరిక చూసుకుని, సవివరంగా ఈ రెండు సినిమాల సమీక్షలూ ఇక్కడే పోస్ట్ చేస్తా.!
– yeSBee