‘పుష్ప 2 ది రూల్’ని వెంటాడుతున్న ఓటీటీ భయం.!
Pushpa 2 The Rule OTT.. ఇవేం టిక్కెట్ ధరలు మహాప్రభో.! సగటు సినీ ప్రేక్షకుడి ఆవేదన ఇది.! ‘పుష్ప 2 ది రూల్’ సినిమా టిక్కెట్ల ధరల్ని ఆ స్థాయిలో డిసైడ్ చేశారు.
ప్రీమియర్ టిక్కెట్ ధర వెయ్యి రూపాయలకు పైనే పలుకుతోంది తెలంగాణలో. తొలి రోజు.. తొలి వీకెండ్ తర్వాత.. ఇలా ప్రత్యేక ధరల్ని డిజైన్ చేశారు.
తెలంగాణతోపాటు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ‘పుష్ప 2 ది రూల్’ సినిమా టిక్కెట్ల ధరల పెంపుకు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది.
సో, తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప 2 ది రూల్8 టిక్కెట్ల ధరలు సామాన్య సినీ ప్రేక్షకులకు అందుబాటులో వుండవ్.
Pushpa 2 The Rule OTT.. బడ్జెట్ సరే.. ప్రేక్షకుల ఆర్థిక పరిస్థితి ఏంటి.?
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమాని భారీ బడ్జెట్‌తో రూపొందించిన మాట వాస్తవం.
ఈ నేపథ్యంలో టిక్కెట్ల ధరల పెంపుకు ప్రభుత్వాలు అనుమతినివ్వడాన్ని తప్పు పట్టలేం. అయితే, ఈ పెంపు సగటు సినీ ప్రేక్షకుడు, సినిమా థియేటర్ వైపు చూడాలంటేనే భయపడేలా వుంది.. అదే అసలు సమస్య.
‘ఓటీటీలో చూద్దాంలే..’ అని చాలామంది సినీ అభిమానులు డిసైడ్ అయిపోయారు. ఇది కేవలం ‘పుష్ప 2 ది రూల్’ సినిమా విషయంలోనే కాదు, చాలా సినిమాల విషయంలో జరిగింది, జరుగుతూనే వుంది.
సినిమా థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే, సినిమాలో మ్యాజిక్ వుండాలి.. అదే సమయంలో, ప్రేక్షకుడి జేబుకి మరీ దారుణంగా చిల్లు పడకూడదు.
కంటెంట్ సంగతో మరి.?
దురదృష్టం ఏంటంటే, జేబులకు చిల్లులు పడటమే కాదు, సినిమాలోనూ చెత్త కంటెంట్ ఈ మధ్య థియేటర్ల వైపు ప్రేక్షకులు చూడాలంటేనే అసహనం ప్రదర్శించే పరిస్థితి ఏర్పడింది.
కేవలం ‘పుష్ప 2 ది రూల్’ విషయంలోనే కాదు, ప్రతి సినిమానీ ఇప్పుడు ఓటీటీ భయం వెంటాడుతూనే వుంది. ఓటీటీ నిబంధనలు కూడా ఇటీవలి కాలంలో సినిమాల్ని ఇబ్బంది పెడుతున్నాయి.
Also Read: పెళ్ళి పుకార్లు.! మీనాక్షిపై ‘గాలి’ పోగేశారేంటి చెప్మా.?
ఆ ఇబ్బంది ఎంతలా వుందంటే, ఓటీటీ సంస్థలు విధించే షరతులకు అనుగుణంగా సినిమాల రిలీజ్ డేట్స్ కూడా మారాల్సి వస్తోంది మరి.!
‘ఓటీటీ వుండగా, థియేటర్ ఎందుకు దండగ..’ అన్న అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చేశాక, ఏ సినిమా అయినా థియేట్రికల్ రన్ విషయమై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అలాగే థియేట్రికల్ బిజినెస్ కూడా ముందు ముందు అయోమయమే.!