Pawan Kalyan OG ATR.. సంజయ్ సాహూకి.. ఏదీ, అంత ఈజీగా దొరకదు.! ఇది ‘జల్సా’ సినిమాలోని డైలాగ్.!
పలు సందర్భాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ డైలాగుని తనకు తాను అన్వయించుకుంటుంటారు. ఏదో సరుదాగా అన్వయించుకునే విషయం కాదిది.
నిజానికి, పవన్ కళ్యాణ్ చెప్పేది నూటికి నూరు పాళ్ళూ వాస్తవం. రాజకీయాల్లో అయినా, సినిమాల్లో అయినా.. ఏదీ, పవన్ కళ్యాణ్‌కి అంత తేలికగా రాలేదు.
తొలి సినిమా కోసం, చేతులు విరగ్గొట్టుకున్నారు పవన్ కళ్యాణ్.. ఆ చేతుల మీద కార్లు ఎక్కించుకోవడం ద్వారా. గుండెల మీద బండల్ని పగలగొట్టించుకున్నారు కూడా.
చెప్పుకుంటూ పోతే, ఇలాంటివి చాలానే వుంటాయ్. దటీజ్ పవన్ కళ్యాణ్.
అలాంటి పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తోందంటే, దానికి ఎలాంటి అడ్డంకులు వుంటాయ్.?
Pawan Kalyan OG ATR.. థియేటర్ల బంద్ కుట్ర..
‘హరి హర వీర మల్లు’ సినిమా విషయంలో అయితే, ఏకంగా థియేటర్ల బంద్‌కి కొందరు ప్లాన్ చేశారు. అది బెడిసి కొట్టిందనుకోండి.. అది వేరే విషయం.
ఇక, ‘ఓజీ’ విషయానికొస్తే, దీనికి వచ్చిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఓవర్సీస్ కంటెంట్, కాస్త ఆలస్యంగా వెళితే, అక్కడి నుంచి అది థియేటర్లకు వెళ్ళడానికి నానా తంటాలూ పడాల్సి వచ్చింది.
అన్నిటికీ, పవన్ కళ్యాణ్ అభిమానులే భుజం కాశారు. ఔను, పవన్ కల్యాణ్ అభిమానులు రంగంలోకి దిగి, హార్డ్ డిస్కుల్ని, ఆయా థియేటర్లకు చేరవేశారు ఓవర్సీస్లో.
దాంతో, ఓవర్సీస్లో రికార్డు స్థాయి ప్రీమియర్లకు రంగం సిద్ధమయ్యింది. ఇక్కడ, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కూడా, చివరి వరకూ సస్పెన్స్.. అన్నట్లే సాగింది.
Also Read: పాత్రికేయమంటే.! పక్కలెయ్యడమే..నా.?
తెలంగాణలో పెంచిన టిక్కెట్ ధరల విషయమై, హైకోర్టులో ఎవరో ఫిర్యాదు చేస్తే, దాని చుట్టూ కొంత గందరగోళం నెలకొంది.
ఇన్ని ఇబ్బందుల నడుమ, ‘ఓజీ’ థియేటర్లలోకి వచ్చేస్తోంది.. అదీ, కనీ వినీ ఎరుగని ‘బజ్’తో.! వంద కోట్లు, రేపు ఉదయానికి.. ప్రీమియర్లతో, అడ్వాన్స్ బుకింగ్స్‌తో.. అంటే, మాటలా.?
అందుకేనేమో.. అలాంటోడు మళ్ళీ తిరిగొస్తే.. అనే డైలాగుని ‘ఓజీ’ కోసం రాసేశారు.! ఇది 100 శాతం యాప్ట్ డైలాగ్.!
