Megastar Chiranjeevi Jai Chiranjeeva.. మెగాస్టార్ చిరంజీవి.! జై చిరంజీవ.! ఆయన బావుంటే, ఆపదలో వున్నవారికి ‘రక్తదానం’ జరుగుతుంది.! కష్టంలో వున్నవాడికి సాయం దొరుకుతుంది.!
అది, సినీ పరిశ్రమలో తలెత్తిన సమస్య అయినా, కోవిడ్ కష్ట కాలంలో ఆక్సిజన్ సమస్య అయినా.. మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగితే, సమస్యకు పరిష్కారం దొరికి తీరుతుంది.
రాజకీయాల్లోకి ప్రవేశించి, తనకు అది సరిపడని రంగమనే ఆలోచనతో, రాజకీయాలకు దూరమైన చిరంజీవిని, ఇంకా రాజకీయాల్లోకి లాగుతూనే వున్నారు.
చిరంజీవి పేరు ప్రస్తావించకపోతే, కొంతమందికి రాజకీయంగా బతుకుదెరువు వుండదు. చిరంజీవిని ప్రస్తావించకపోతే, సోషల్ మీడియాలో కొందరికి వ్యూస్ దక్కవు.
అసలంటూ, చిరంజీవి పేరు ప్రస్తావించకపోతే.. మహామహులనుకునేవారికే, ఉనికి వుండదు. చిరంజీవిని తూలనాడితే, ఆయన అభిమానులు ట్రిగ్గర్ అయిపోతారన్నది కొందరి నమ్మకం.
Megastar Chiranjeevi Jai Chiranjeeva.. శిఖరాన్ని చూసి గ్రామ సింహాలు మొరిగితే..
నిజమే, శిఖరం లాంటి చిరంజీవిని చూసి కొన్ని గ్రామ సింహాలు మొరిగితే, అది చికాకు కలిగిస్తుంది చిరంజీవి అభిమానులకి.
సరే, ఆ కొందరి బతుకుదెరువు చెడగొట్టడమెందుకని, చిరంజీవి కూడా చాలా సందర్భాల్లో లైట్ తీసుకుంటుంటారు.
కొండని చూసి, కుక్కలు మొరిగితే, కొండకు చేటా? అనుకుంటారాయన.
Also Read: పాత్రికేయమంటే.! పక్కలెయ్యడమే..నా.?
అదే, ఆ కొందరికి ‘లోకువ’గా మారిపోయింది. చట్ట సభల్లో తూలనాడటం, బ్లడ్డు బ్రీడు.. అంటూ దిగజారిపోవడం.. ఇవన్నీ చాలాకాలంగా చూస్తూనే వున్నాం.
మెంటల్ సర్టిఫికెట్ హోల్డర్ ఒకరు, సర్టిఫికెట్ లేని మానసిక రోగి ఇంకొకరు.. రాజకీయ ప్రత్యర్థులయి వుండీ, తెరవెనుకాల ఇద్దరూ కలిసి చిరంజీవి మీద కుట్రలు పన్నుతుంటారు.
నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
నలుగురూ నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? అయినా, కొండని చూసి కుక్కలు మొరిగితే, కొండకు చేటా.?
జై చిరంజీవ.! నువ్వెప్పుడూ సంతోషంగా వుండాలి.!
నీ పేరు కొందరికి బతుకు తెరువు.. నిన్ను తూలనాడి అయినా, వాళ్ళ కడుపులు నింపుకుంటున్నారు.! అలాంటి జాతి తక్కువ గ్రామ సింహాల్ని పట్టించుకోవద్దు.
ఆ గ్రామ సింహాల బతుకుదెరువు కష్టాల్ని చూసి జాలి పడండి, ఆందోళన చెందొద్దు.. ఇది మెగాభిమానులకి చెప్పే మాట.!
