Chandrababu Slams Balakrishna.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై గుస్సా అయ్యారట.!
అసెంబ్లీలో ఇలాగేనా వ్యవహరించేది.? పార్టీకి, ప్రభుత్వానికీ చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదంటూ చంద్రబాబు మండిపడ్డారట.!
ఇంతకీ, చంద్రబాబు క్లాస్ తీసుకున్న ఎమ్మెల్యేలలో, నందమూరి బాలకృష్ణ పేరు వుందా.? లేదా.? ఇదీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్.
Chandrababu Slams Balakrishna.. బావమరిది బాధ్యతారాహిత్యం..
చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ, అసెంబ్లీ సాక్షిగా అత్యంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడారు. ‘సైకోగాడు’ అంటూ, మాజీ ముఖ్యమంత్రిపై నోరు పారేసుకున్నారు బాలకృష్ణ.
బాలకృష్ణ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యలతో టీడీపీ పరువు బజార్న పడ్డట్లయ్యింది.

ఇంకోపక్క, ప్రభుత్వం సినీ పరిశ్రమ తరఫున ప్రభుత్వాన్ని సంప్రదించే కమిటీలో తన పేరుని తొమ్మిదో సంఖ్యలో పెట్టడమూ బాలయ్యకి నచ్చలేదు.
‘ఎవడాడు నా పేరుని తొమ్మిదో నెంబర్లో పెట్టింది.?’ అంటూ, నిండు సభలో బాలకృష్ణ నోరు పారేసుకున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేసింది.
సినిమా హీరో.. చట్ట సభల్లో జీరో.!
నందమూరి బాలకృష్ణ థర్డ్ టైమ్ ఎమ్మెల్యే. అయినా, ఆయన చట్ట సభల్లో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. వచ్చినా, ఫొటోలకే పరిమితమవుతుంటారు.
అంతే తప్ప, చట్ట సభల్లో ప్రజా సమస్యలపై బాలకృష్ణ మాట్లాడింది చాలా చాలా తక్కువ. మాట్లాడితే, ఇదిగో ఇలా వుంటుంది.!
Also Read: జూనియర్ ఎన్టీయార్ని ఎవరూ ఆపలేరు.!
బావమరిది వ్యవహారం బావ చంద్రబాబుకి తలనొప్పిగా మారింది. అలాగని, బాలయ్యను అదుపులో పెట్టగలరా.? అంటే, ఆ ఛాన్స్ వుంటే, బాలయ్య ఎందుకు ఇంతలా చెలరేగిపోతారు.?
చట్ట సభలకు ఎవర్ని పంపుతున్నామో ఓసారి ఆత్మవిమర్శ చేసుకుంటే, ‘చట్ట సభల్లో ఇలాగేనా వ్యవహరించేది.?’ అని ఎమ్మెల్యేలను మందలించే పని వుండదు చంద్రబాబుకి.!
టీడీపీ ఎమ్మెల్యేల తీరుతో, కూటమి ప్రభుత్వానికి ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడింది. కూటమి సఖ్యత దెబ్బ తినేలా వ్యవహరిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు.. బాలకృష్ణ సహా.!
